Begin typing your search above and press return to search.

ల‌వ్ లో ఫెయిలైతే ఐస్ క్రీమ్ తినాలా?

తాజాగా ఈ బ్యూటీ ప్రేమ‌లో వైఫల్యం గురించి..అందులో పెయిన్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 4:30 PM GMT
ల‌వ్ లో ఫెయిలైతే ఐస్ క్రీమ్ తినాలా?
X

బాలీవుడ్ న‌టుడు చుంకీపాండే వార‌సురాలిగా తెరంగేట్రం చేసిన‌ అన‌న్యా పాండే గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డు 'లైగ‌ర్' సినిమాతో టాలీవుడ్ లో నూ లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ తొలి ప‌రాజ‌యంతోనే సొగ‌స‌రి మ‌ళ్లీ ముంబైకి తిరిగెళ్లిపోయింది. అక్క‌డే సినిమాలు చేసుకుంటూ బిజీ అవుతుంది. ఇక ఈ భామ ఎఫైర్ల గురించి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో ఇషాన్ క‌ట్ట‌ర్ తో ఏ రేంజ్ లో ప్రేమా పాఠాల్లో బిజీ అయిందో తెలిసిందే.

ప‌బ్ లు పార్టీలు..వెకేష‌న్లు అంటూ ఈ జంట తిర‌గ‌ని చోటు లేదు. చిక్క‌ని కెమెరా లేదు. ఇద్ద‌రి ల‌వ్ లో సీరియ‌స్ నెస్ చూసి పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మ‌నుకున్నారంతా. కానీ ఇంత‌లోనే సీన్ రివ‌ర్స్ అయింది. అత‌గాడితో చెడింది. దీంతో కొన్నాళ్ల పాటు ప్రేమ‌కు దూరంగా ఉన్న అమ్మ‌డు మ‌ళ్లీ ఆదిత్య రాయ్ క‌పూర్ తో కొత్త ప్రేమ‌కి తెర తీసిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్ ఇప్పుడు పాలు-నీళ్ల‌లా బ‌ల‌ప‌డింది.

ఒక‌రంటే ఒక‌రు విడిచి ఉండ‌లేక‌పోతున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రికీ సంబంధించిన పార్టీ వీడియో లు.. ప్ర‌యివేట్ ఫోటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టిన సంద‌ర్బాలెన్నో. మ‌రి ఈ ప్రేమ ఎంత‌వ‌ర‌కూ వెళ్తుంది? పెళ్లి పీట‌లెక్కిస్తారా? అన్న‌ది తెలియాలి. తాజాగా ఈ బ్యూటీ ప్రేమ‌లో వైఫల్యం గురించి..అందులో పెయిన్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇటీవ‌లే ఆమె న‌టించిన 'ఖో గ‌యే హ‌మ్ క‌హీ' మంచి విజ‌యం సాధించ‌డంతో అన‌న్యా పాండే మీడియాని చుట్టేసి రౌండ్లు వేస్తోంది.

దీనిలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో.. 'ప్రేమ‌లో విఫ‌ల‌మైతే బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నించాలి. అలాగే ఉండిపోతే ప‌రిస్థితులు దారుణంగా ఉంటాయి. ఎంతైనా మ‌న‌సుకు త‌గిలిన గాయాన్ని తొంద‌ర‌గా మర్చిపోలేం. బ‌య‌ట ప‌డ‌టం క‌ష్ట‌మైనే ప‌నే. కానీ గుండె నిండా ధైర్యాన్ని నింపుకోవాలి. మ‌న‌సు మ‌రోప నిపై ల‌గ్నం చేయాలి. వైఫ‌ల్యం మ‌న‌సులోకి రానివ్వ‌కూడ‌దు. అందుకోసం నేను అయితే ఆ టైమ్ లో ఐస్ క్రీమ్స్ తింటూ.. అర్జిత్ సింగ్.. ఆషిక్-2 సినిమా పాట‌లు వింటూ గ‌డిపాను' అంది.