బ్లాక్ లో మెరిసి పోతున్న 'లైగర్' బ్యూటీ
తాజాగా ఒక కొత్త బ్రాండ్ ను పరిచయం చేస్తూ అనన్య పాండే షేర్ చేసిన ఫోటోలు కన్నుల విందుగా ఉన్నాయి.
By: Tupaki Desk | 7 Oct 2023 10:41 AM GMTస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తో బాలీవుడ్ లో అడుగు పెట్టిన స్టార్ కిడ్ అనన్య పాండే. ఈ అమ్మడు తక్కువ సమయంలోనే సౌత్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన 'లైగర్' సినిమాలో ఈ అమ్మడు నటించడం ద్వారా సౌత్ లో కూడా గుర్తింపును దక్కించుకుంది.
లైగర్ సినిమా నిరాశ పర్చడంతో సౌత్ లో కంటే బాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో ప్రస్తతుం అక్కడే సినిమాలు చేస్తూ ఉంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో వచ్చిన ఈ అమ్మడు మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు మూడు హిందీ సినిమాలకు కమిట్ అయిన ముద్దుగుమ్మ అనన్య పాండే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటో షూట్ ని షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ గా ఇప్పటి వరకు కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకోలేదు.. కానీ మోడల్ గా మాత్రం స్టార్ హీరోయిన్స్ కి పోటీగా నిలుస్తోంది.
తాజాగా ఒక కొత్త బ్రాండ్ ను పరిచయం చేస్తూ అనన్య పాండే షేర్ చేసిన ఫోటోలు కన్నుల విందుగా ఉన్నాయి. విభిన్నమైన ఔట్ ఫిట్ లో అన్ని ఫోటోలు కూడా భలే ఉన్నాయే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బ్లాక్ డ్రెస్ లో చూపు తిప్పుకోనివ్వడం లేదు అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. స్కిన్ షో చేయకున్నా కూడా బ్లాక్ డ్రెస్ లో అనన్య చాలా అందంగా కనిపిస్తుంది అనేది నెటిజన్స్ మాట.