నా వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా అనుకోవద్దు: అనసూయ
అప్పుడప్పుడు ఈమె వేసే ట్వీట్స్, అమ్మడు చేసే కామెంట్స్ వల్ల అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటుంది అనసూయ.
By: Tupaki Desk | 12 Feb 2025 11:32 AM GMTజబర్దస్త్ షో ద్వారా అనసూయ బాగా పాపులరైన విషయం తెలిసిందే. ఆ షోలో తన యాంకరింగ్ తో పాటూ అందాలతో కూడా ఆకట్టుకుంది అనసూయ. ఓ వైపు యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అనసూయ రామ్ చరణ్ నటించిన రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి మంచి గుర్తింపు అందుకుంది.
![](https://content.tupaki.com/h-upload/2025/02/12/691865-ana2.gif)
ఆ సినిమా తర్వాత అనసూయ యాంకరింగ్ మానేసి పూర్తిగా సినిమాల వైపు మళ్లింది. రీసెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన పుష్ప2లో కూడా అనసూయ నటించిన విషయం తెలిసిందే. సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన ఫోటోలను, అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ.
అప్పుడప్పుడు ఈమె వేసే ట్వీట్స్, అమ్మడు చేసే కామెంట్స్ వల్ల అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటుంది అనసూయ. తాజాగా అనసూయ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. నేను నాకు ఎదురైన అనుభవాన్ని, నేను చూసిన సంఘటనలను మాత్రమే షేర్ చేసుకున్నాను తప్పించి ఎవరినీ బ్లేమ్ చేయలేదని, కేవలం అందరికీ అవగాహన రావాలనే అలా మాట్లాడానని, నేను అనని వాటిని అన్నట్టు ఎవరూ ప్రొజెక్ట్ చేయొద్దని అనసూయ పోస్ట్ చేసింది.
అంతేకాదు, ఎవరేమనుకున్నా అవేమీ తన క్యారెక్టర్ ను డిసైడ్ చేయలేవని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, తనను అర్థం చేసుకునే వారికి మాత్రమే తన ప్రేమను అందిస్తానని అనసూయ ట్వీట్ లో పేర్కొంది. దీంతో అనసూయ ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి వేసిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే రీసెంట్ గా అనసూయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఆ ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్ గురించి, ఫ్యామిలీ గురించి, రిలేషన్‌షిప్ గురించి అనూ ఎన్నో చెప్పుకొచ్చింది. తన వ్యాఖ్యల వల్ల అందరూ అనసూయను నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనసూయ ఆ ట్వీట్ చేసిందని అర్థమవుతుంది. ప్రస్తుతం అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. అయినా ఇలా వివాదాల్లో నిలవడం అనసూయకు కొత్తేమీ కాదు.