Begin typing your search above and press return to search.

తెల్లని చీరలో అనసూయ అందం.. స్టన్నింగ్ లుక్స్!

టెలివిజన్‌ స్క్రీన్‌పై గ్లామర్‌ తో టాలెంట్‌తో స్పెషల్ క్రేజ్ అందుకున్న అనసూయ భరద్వాజ్‌ తాజాగా సోషల్‌ మీడియాను తన అందంతో షేక్‌ చేస్తోంది

By:  Tupaki Desk   |   15 March 2025 11:07 AM IST
తెల్లని చీరలో అనసూయ అందం.. స్టన్నింగ్ లుక్స్!
X

టెలివిజన్‌ స్క్రీన్‌పై గ్లామర్‌ తో టాలెంట్‌తో స్పెషల్ క్రేజ్ అందుకున్న అనసూయ భరద్వాజ్‌ తాజాగా సోషల్‌ మీడియాను తన అందంతో షేక్‌ చేస్తోంది. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా తనదైన ముద్ర వేసిన ఈ స్టార్‌ బ్యూటీ, ప్రతి అప్‌డేట్‌తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసిన ఫోటోషూట్‌ మరింత వైరల్‌గా మారింది.

తెల్లని చీరలో ఆమె చూపిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఈ ఫోటోల్లో అనసూయ సంప్రదాయ హోదాను మోడ్రన్‌ టచ్‌తో ప్రదర్శించింది. తెల్లని చీరకు మ్యాచింగ్‌ బ్లాక్‌ బ్లౌజ్‌ ధరించి, డిజైనర్‌ నగలతో తన లుక్‌ను ప్రత్యేకంగా మలుచుకుంది. కురులను వదులుగా ఒదిలిపెట్టి, స్టైలిష్‌ ఇయర్‌ రింగ్స్‌తో తన గ్లామర్‌ను ఇంకాస్త పెంచేసింది.

హోలి ఫెస్టివల్‌ కాన్సెప్ట్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు విపరీతమైన రెస్పాన్స్‌ ఇస్తున్నారు. సాధారణంగా అనసూయ ఇలాంటి డిఫరెంట్‌ స్టైల్‌ షూట్స్‌కు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తుంది. ప్రత్యేకించి ఆమె మోడర్న్‌ వేర్‌తో పాటు ట్రెడిషనల్‌ లుక్‌లో కూడా అద్భుతంగా మెరిసిపోతుంది. ఈ సారి స్పెషల్ డిజైన్‌తో ఉన్న చీరను ఎంచుకోవడం విశేషం. ఫ్యాషన్‌ ప్రపంచానికి సంబంధించిన తన ఆసక్తిని ఈ ఫోటోల్లో స్పష్టంగా చూపించింది. ఈ ఫోటోషూట్‌ అనసూయ స్టైల్‌ క్వీన్‌గా మారిపోయిందనే టాక్‌ తెచ్చిపెట్టింది.

ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ ఫోటోలపై సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్‌ నుంచి మంచి స్పందన వస్తోంది. సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అనసూయ ప్రత్యేకత. కేవలం యాంకర్‌గా మాత్రమే కాదు, నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకుంది. ప్రస్తుతం అనసూయ సినిమా ప్రాజెక్టులపై ఫోకస్‌ పెట్టింది. ఇటీవల ఆమె నటించిన ‘పుష్ప 2’లో పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. అలాగే కొన్ని క్రేజీ వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తున్నట్లు సమాచారం.