అనసూయ గోల్డెన్ రాయల్ లుక్.. స్టన్నింగ్!
ఆకుపచ్చ-బంగారు రంగుల పట్టు చీరలో, జరీ అంచుతో మెరిసిపోతూ, విలక్షణమైన ఆభరణాలతో, గజ్జెలు, బిగిన గాజులతో సంప్రదాయాన్ని చాటింది.
By: Tupaki Desk | 10 March 2025 5:22 PM ISTఅనసూయ భరద్వాజ్.. నాన్ గ్లామర్ లుక్‌లో కూడా తనదైన స్టైల్‌తో కట్టిపడేస్తుంటుంది. ఎప్పుడూ ట్రెండీ లుక్స్‌లో దర్శనమిచ్చే ఈ భామ ఈసారి సంప్రదాయ వస్త్రధారణలో కనిపించింది. ఆకుపచ్చ-బంగారు రంగుల పట్టు చీరలో, జరీ అంచుతో మెరిసిపోతూ, విలక్షణమైన ఆభరణాలతో, గజ్జెలు, బిగిన గాజులతో సంప్రదాయాన్ని చాటింది.

ఈ ఫోటోషూట్‌లో అనసూయ తన ఎక్స్‌ప్రెషన్స్‌తో, హావాభావాలతో మరోసారి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. రెడ్ బ్యాక్‌డ్రాప్ ముందు కూర్చొని, ఖద్దరు సెట్‌లో రాజసంగా కనిపించిన అనసూయ.. తన హుందాతనాన్ని, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా కనిపించింది. వెండితెరపై ఎప్పుడూ స్టైలిష్ లుక్స్‌లో కనిపించే ఆమె ఈసారి రాయల్ లుక్‌లో సరికొత్త అందాన్ని చూపించింది.

క్లాసిక్ డిజైన్ బ్లౌజ్, మట్టి రంగుల్లో తళుకులీనే నాజూకైన నగలు ఆమె అందాన్ని మరింత పెంచాయి. కెమెరా ముందు అనసూయ ఇచ్చిన స్టిల్స్ చూస్తుంటే ఆమె స్టైలింగ్‌కు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందని అర్థమవుతోంది. ఆమె చూపులు, హుందాతనం కలిగిన భంగిమలు.. ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోషూట్‌ను షేర్ చేసిన అనసూయపై అభిమానులు కామెంట్స్, లైక్స్‌తో ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు. ట్రెండీ దుస్తులు, మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌తోనే కాకుండా.. ఇలాంటి సంప్రదాయ సాంప్రదాయ దుస్తుల్లో కూడా అనసూయకు ఎంతలా కుదిరిందో ఈ ఫోటోలు చెబుతున్నాయి. ఆమె ఎక్కడి లుక్ అయినా ఒంటి చేసుకుని మెరిసిపోవడం ఆమె ప్రత్యేకత.

మరీ ముఖ్యంగా ఈ పట్టు చీరల లుక్‌లో అనసూయ ఎంతో గ్రేస్‌తో కనిపించడం విశేషం. సినీ రంగంలో నటిగా, యాంకర్‌గా, సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఐకాన్‌గా మారిన అనసూయ.. ఈ ఫోటోషూట్ ద్వారా మరోసారి తన ట్రెండ్ సెట్టింగ్ స్టైల్‌ను నిరూపించింది. ఆమె అందాన్ని పొగుడుతూ అభిమానులు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.