Begin typing your search above and press return to search.

మూడో ప్రెగ్నెన్సీపై అనసూయ కామెంట్

నీవేంటే.. కనేసి నీ వర్క్ కు నీవు వెళ్లిపోతావని అంటున్నట్లు చెప్పారు అనసూయ. కానీ ఆడబిడ్డ పుట్టకపోతే తాను వేస్ట్ అన్నట్లు కామెంట్ చేశారు.

By:  Tupaki Desk   |   21 Dec 2024 12:09 PM GMT
మూడో ప్రెగ్నెన్సీపై అనసూయ కామెంట్
X

టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బుల్లితెరపై బిజీగా ఉన్న అమ్మడు.. ఇప్పుడు సినిమా షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు! వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. రీసెంట్ గా పుష్ప2: ది రూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నారు.

అయితే సినిమాల్లో నటిస్తూనే.. ఫ్యామిలీకి క్వాలిటీ టైమ్ కేటాయిస్తున్నారు అనసూయ. ఎప్పటికప్పుడు వెకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ.. అందుకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేస్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి చిల్ అవుతున్న అమ్మడు.. ఇప్పుడు మూడో ప్రెగ్నెన్సీపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన అనసూయ.. తనకు మూడో బిడ్డ కనాలని ఉందని తెలిపారు. అది కూడా ఆడపిల్లకు జన్మనివ్వాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆ విషయంలో భర్త కోపరేట్ చేయడం లేదని చెబుతూ నవ్వేశారు. ఎందుకు ఆడబిడ్డ అంటున్నారని చెప్పారు అనసూయ.

నీవేంటే.. కనేసి నీ వర్క్ కు నీవు వెళ్లిపోతావని అంటున్నట్లు చెప్పారు అనసూయ. కానీ ఆడబిడ్డ పుట్టకపోతే తాను వేస్ట్ అన్నట్లు కామెంట్ చేశారు. ఓసారి తన చిన్న కొడుకు ఎందుకు కూతురు కావాలి అని అడిగినట్లు చెప్పారు. చంపేస్తానని అన్నాడని, అందుకే ఆడపిల్ల ఉంటే బ్యాలెన్స్ అవుతుందని అన్నారు. అప్పుడే అబ్బాయిలకు ఎలా ఉండాలో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇల్లు చక్కబడాలంటే ఆడపిల్ల ఉండాలని.. కచ్చితంగా ఉండి తీరాలని వ్యాఖ్యానించారు. మనమే యూనివర్స్‌ ను బ్యాలెన్స్ చేస్తుంటామని.. అందుకే ఆడబిడ్డ కావాలని తెలిపారు. ప్రస్తుతం అనసూయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన అనసూయ.. ఒక్కసారిగా వేరే లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నారు. స్టార్ యాంకర్ గా మారిపోయారు. అనేక షోస్ ను హోస్ట్ చేశారు. అప్పటికే సినీ ఇండస్ట్రీలోకి నాగ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. సోగ్గాడే చిన్ని నాయనా మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. అలా ఆ తర్వాత మంచి అవకాశాలు రాగా.. బుల్లితెరకు బై చెప్పేసి సినిమాలతో బిజీ అయిపోయారు.