Begin typing your search above and press return to search.

పుష్ప 2.. ప్రతి 10 నిమిషాలకు ఓసారి..

అదే సమయంలో సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   28 Oct 2024 5:29 AM GMT
పుష్ప 2.. ప్రతి 10 నిమిషాలకు ఓసారి..
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2పై సినీ ప్రియులతో పాటు అభిమానుల్లో అంచనాలు ఎలాంటి రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న మూవీ కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు బొమ్మ పడుతుందా.. చూసేద్దామని అని ఉవ్విళ్లూరుతున్నారు. మరోసారి పుష్పరాజ్ స్వాగ్ ను ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

పుష్ప-1లో యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. మాస్ నెగిటివ్ రోల్ లో దాక్షాయణిగా ఓ రేంజ్ లో మెప్పించారు. ఇప్పుడు సీక్వెల్ లో కూడా నటిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-8 దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో పుష్ప-2 గురించి హోస్ట్ నాగార్జున ప్రస్తావించారు. దీంతో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు.

పుష్ప 2 మూవీలో 10 నిమిషాలకు ఓ హై ఇచ్చే మూవ్ మెంట్ ఉంటుందని అనసూయ చెప్పారు. మూవీలో 10 నిమిషాల తర్వాత క్లైమాక్స్‌ లా ఉంది.. అదేంటి అనిపిస్తుంది.. కానీ అలా ఉండదని తెలిపారు. ఫస్ట్ పార్ట్ దాదాపు ఇంట్రడక్షన్ అని పేర్కొన్నారు. అసలు కథ సీక్వెల్ లోనే ఉంటుందని వెల్లడించారు. మరింత డెప్త్ గా పుష్ప 2- ది రూల్ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దీంతో డైరెక్టర్ సుకుమార్.. పెద్ద ప్లానే వేసినట్లు ఉన్నారని నెటిజన్లు చెబుతున్నారు. సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. ఇక.. పుష్ప-2 షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో పూర్తవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐటెం సాంగ్ మాత్రమే పెండింగ్ ఉందని రీసెంట్ గా మేకర్స్ తెలిపారు. ఓ వైపు షూటింగ్ ను పూర్తి చేస్తూనే.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. మరికొద్ది రోజుల్లో ఫస్ట్ కాపీని సిద్ధం చేయనున్నారు.

ఆ తర్వాత సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న హైప్ ను దృష్టిలో పెట్టుకుని.. మేకర్స్ భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో భారీ ఈవెంట్లు ఏర్పాటు చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని భాషలకు అనుగుణంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లి సందడి చేయనున్నారట. షూటింగ్ కంప్లీట్ అవ్వడమే లేట్.. ప్రమోషనల్ టూర్ కు మొదలు పెట్టనున్నారని సమాచారం. మరి పుష్ప-2 మూవీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.