Begin typing your search above and press return to search.

అనసూయ.. చీరలో హంసలాంటి అందం..

అనసూయ ధరించిన శారీలోని ప్రతీ ఎలిమెంట్ ఆమె వ్యక్తిత్వాన్ని హైలైట్ చేసింది. ఆమె హెయిర్‌స్టైల్‌తో పాటు మేకప్ సింపుల్‌గా ఉండటం వల్ల లుక్ మరింత క్లాసీగా కనిపించింది.

By:  Tupaki Desk   |   13 Dec 2024 9:30 AM GMT
అనసూయ.. చీరలో హంసలాంటి అందం..
X

తెలుగు టెలివిజన్ ప్రపంచంలో తనదైన శైలితో ప్రేక్షకులను ఆకర్షించిన అనసూయ భరద్వాజ్, తన గ్లామర్‌తో పాటు సాంప్రదాయ లుక్స్‌లోనూ అందాన్ని హైలెట్ చేస్తూ నిత్యం ట్రెండ్ సెట్ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన శారీ ఫోటోస్ లో ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను మరింతగా ఎలివేట్ చేశాయి. పట్టు చీరలో పింక్ బ్లౌజ్, వెండి నెక్లెస్, సంప్రదాయ ఆభరణాలతో ఆమె మరింత అందంగా మెరిసింది.

అనసూయ ధరించిన శారీలోని ప్రతీ ఎలిమెంట్ ఆమె వ్యక్తిత్వాన్ని హైలైట్ చేసింది. ఆమె హెయిర్‌స్టైల్‌తో పాటు మేకప్ సింపుల్‌గా ఉండటం వల్ల లుక్ మరింత క్లాసీగా కనిపించింది. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లౌజ్ డిజైన్ వినూత్నంగా ఉండటం విశేషం. ఈ ఫోటోలకు అనసూయ ఇచ్చిన క్యాప్షన్ "హంస అందం" అంటూ తన అభిమానులను విశేషంగా ఆకర్షించింది.

అనసూయ కెరీర్ గురించి మాట్లాడితే, టెలివిజన్ షోస్ నుంచి సినిమాల వరకు తనదైన గుర్తింపు సంపాదించింది. పుష్పలో దక్షాయణి పాత్రతోనే కాకుండా అనేక చిత్రాల్లో ఆమె చేసిన క్యారెక్టర్స్ ఆడియన్స్‌ను మెప్పించాయి. ప్రస్తుతానికి అనసూయ పలు క్రేజీ ప్రాజెక్టులలో భాగస్వామ్యమై ఉంది. ముఖ్యంగా పుష్ప 2లో ఆమె కనిపించింది కొన్ని సీన్స్ లోనే అయినప్పటికీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇలాంటి రోల్స్ లో కూడా అనసూయకి పోటీ ఎవరు రారేమో అని చెప్పవచ్చు.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు అనసూయ ఫ్యాషన్ సెన్స్‌ను కొనియాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ ట్రెండ్‌లతో అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం ఆమె ప్రత్యేకత. ఆమె తన ఫోటోషూట్‌ల ద్వారా యువతకు ఫ్యాషన్ స్పూర్తిగా నిలుస్తూ, మరింత ప్రశంసలు అందుకుంటోంది. ఇక ప్రస్తుతం కూడా అనసూయ పలు బిన్నమైన సినిమాలతో బిజీగా మారింది. అలాగే తమిళ్ హిందీ భాషల్లో కూడా ఆమె అవకాశాలు వస్తున్నట్లు టాక్.