అనసూయ.. చీరలో స్టన్నింగ్ గ్లామర్ ట్రీట్
తాజాగా అనసూయ మరోసారి తన స్టన్నింగ్ లుక్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది.
By: Tupaki Desk | 8 March 2025 11:00 PM ISTటాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా తనదైన ముద్ర వేసుకున్న అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ తన హవాను కొనసాగిస్తూ దూసుకుపోతోంది. అందం, అభినయం, గ్లామర్, స్టైల్ అన్నీ కలగలిసిన ఆమె.. ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా అనసూయ మరోసారి తన స్టన్నింగ్ లుక్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. వైట్ ఫ్లోరల్ ట్రాన్స్‌పరెంట్ సారీతో గ్లామరస్ లుక్ లో దర్శనం ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది.
ఈ ఫోటోషూట్ లో అనసూయ హాల్టర్ నెక్ వైట్ బ్లౌజ్ కు మ్యాచ్ అయ్యే ఫ్లోరల్ ప్రింటెడ్ సారీలో అదరగొట్టింది. స్టైలిష్ హెయిర్, మినిమల్ జ్యువెల్రీతో ఆమె ఇచ్చిన పొజెస్ మరో లెవల్ లో ఉన్నాయి. ట్రాన్స్‌పరెంట్ లుక్ తో తన గ్లామర్ ను మరింత హైలైట్ చేసింది. సారీలో గ్లామర్ ను హైలెయ్ చేయడమంటే ఇదే అనిపించేలా కనిపిస్తోంది. ఒకవైపు అందం, మరోవైపు తన మైమరిపించే ఎక్స్‌ప్రెషన్స్ తో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అనసూయ స్టైల్, ఫ్యాషన్ గురించి చెప్పనక్కర్లేదు. ఆమె ఏ లుక్ లో కనిపించినా ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ సారీ లుక్ లో కూడా గ్లామర్ డోస్ పెంచుతూ ఫ్యాన్స్ ని కనువిందు చేస్తోంది. ఆమె కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా ఓ సక్సెస్‌ఫుల్ నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది. ‘పుష్ప’లో దాక్షయణిగా నటించి మరో లెవల్ లో పేరు తెచ్చుకుంది. త్వరలోనే రానున్న మరికొన్ని బిగ్ మూవీస్ లోనూ అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, నెటిజన్లు ఆమె అందాన్ని చూసి ఫిదా అవుతున్నారు. కామెంట్స్ విభాగంలో ‘అమ్మో మైండ్ బ్లాక్ అయిపోయింది’, ‘అనసూయ స్టన్నింగ్ గ్లామర్ ’, ‘వైట్ లో ఎంతో అందంగా ఉన్నావ్’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.