Begin typing your search above and press return to search.

జాన్వీకి డబ్బింగ్.. అనసూయ ఏమందంటే?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Sep 2024 6:14 AM GMT
జాన్వీకి డబ్బింగ్.. అనసూయ ఏమందంటే?
X

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో తారక్ అంటే చాలా ఇష్టమని అనేకసార్లు చెప్పిన అమ్మడు.. ఇప్పుడు ఫేవరెట్ హీరో మూవీతోనే అడుగుపెడుతోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో తంగం పాత్రలో అచ్చ పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఆమె లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే మేకర్స్ రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు ట్రైలర్ వచ్చాక.. అంతా జాన్వీ కోసమే మాట్లాడుకుంటున్నారు. తెలుగు పూర్తిగా రాని ఆమె.. డైలాగ్స్ ఎలా చెప్పిందని అనుకున్నారు. కానీ జాన్వీకి తెలుగు స్టార్ యాంకర్, నటి అనసూయ డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఫుల్ పోస్టులు పెడుతున్నారు. నేచురల్ గా బాగా సింక్ అయిందని అంటున్నారు.

దీనిపై అనసూయ లేదా మేకర్స్ ఇప్పటి వరకు అఫీషియల్ గా చెప్పకపోయినా.. మూవీ లవర్స్ మాత్రం ఆమెనే డబ్బింగ్ చెప్పిందని ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో అనసూయ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. "నొప్పించే లేదా పాజిటివ్ గా తీసుకున్న విషయాన్ని పక్కన పెట్టండి. నేను దానిని ఫన్నీగా భావిస్తున్నా. వారు ఆలోచించినదే.. అనుకున్నదే నిజమని అసలు కొందరు ఎలా భావిస్తారు" అని అడిగింది.

"అసలు నిజంతో పని వద్దు వాళ్లకు.. మళ్లీ దానిపై చర్చలు, ఒపినీయన్లు, అసలు నిజమేంటో అక్కర్లేదు.. మన సినిమాలు ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతున్న తీరును అభినందిద్దాం.. క్రాఫ్ట్, ఆర్ట్, హార్డ్ వర్క్‌ ను అభినందిద్దాం.. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవల్ లో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీ సాధించిన విజయాలను చూసి గర్విద్దాం" అని అనసూయ పోస్ట్ పెట్టింది. కానీ జాన్వీకి డబ్బింగ్ ఇచ్చిందో లేదో మాత్రం చెప్పలేదు.

అయితే గతంలో వేదం మూవీకి గాను హీరోయిన్ దీక్షా సేథ్ కు డబ్బింగ్ చెప్పింది అనసూయ. మళ్లీ ఇప్పుడు దేవర సినిమా కోసం తన టాలెంట్ చూపించిందని నెటిజన్లు చెబుతున్నారు. కానీ అనసూయ ట్వీట్ మాత్రం వేరేలా ఉంది. అనుకున్నదే నిజమని ఎలా అనుకుంటారని క్వశ్చన్ చేసింది. మొత్తానికి అమ్మడు.. జాన్వీ కపూర్ కు అసలు డబ్బింగ్ చెప్పిందో లేదో క్లారిటీ రావడం లేదు. ఆమె కూడా క్లియర్ గా పోస్ట్ లో చెప్పలేదు.