Begin typing your search above and press return to search.

వీరమల్లులో అను మేడం ఇలా..!

రాజ కుటుంబంకు చెందిన మహిళగా అనసూయ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు ఈ ఫోటోను చూస్తే అర్థం అవుతుంది.

By:  Tupaki Desk   |   25 March 2025 3:20 PM
Anasuya viral look
X

అనసూయ బుల్లి తెర నుంచి వెండి తెరపై ఎంట్రీ ఇచ్చి బిజీ బిజీగా ఉంది. వరుస సినిమాలతో ఆకట్టుకుంటోంది. ఈ మధ్య కాస్త స్లో అయినట్లు అనిపించినా పెద్ద సినిమాల్లో ఈమె నటిస్తుందని సమాచారం. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇన్నాళ్లు వీరమల్లు సినిమాలో ఈమె పాత్ర ఏంటి, గెటప్ ఏంటి అనే విషయమై క్లారిటీ లేదు. తాజాగా సోషల్ మీడియా ద్వారా వీరమల్లు సినిమాలోని తన లుక్‌ను రివీల్‌ చేసింది. రాజ కుటుంబంకు చెందిన మహిళగా అనసూయ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు ఈ ఫోటోను చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


చాలా రోజులైంది.. కాసేపు మాట్లాడుకుందామా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అనసూయ అభిమానులతో చిట్‌ చాట్‌ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. పలువురు హరిహర వీరమల్లు సినిమా గురించి అడగడంతో పాటు, కొల్లగొట్టేసిందిరో సాంగ్ బీటీఎస్ అంటూ ఒక అభిమాని రిక్వెస్ట్‌ చేసిన సమయంలో అనసూయ ఈ ఫోటోను షేర్‌ చేసింది. ఎవరికైనా పవన్‌ కళ్యాణ్ గారితో ఫోటో కావాలి అంటే... దురదృష్టవశాత్తు నా వద్ద ఆ ఫోటో లేదని పోస్ట్‌ పెట్టింది. వీరమల్లు సినిమాలో అనసూయ ఇలా అంటూ నెట్టింట పవన్‌ కళ్యాణ్ అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్‌ చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌ ఆలస్యం అవుతూ వస్తోంది.

మార్చిలో విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు సినిమాను మే నెలలో విడుదల చేయబోతున్నట్లు యూనిట్‌ సభ్యుల ద్వారా అధికారిక ప్రకటన వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల చేతులు మారింది. ప్రస్తుతం ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనసూయ రామ చిలుకతో ఆడుతూ ఉన్న ఫోటోను షేర్‌ చేయడం ద్వారా వీరమల్లు సినిమాతో మరోసారి అనసూయ ఆకట్టుకోవడం ఖాయం అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.

మరో అభిమాని మిమ్ములను బుల్లి తెరపై మిస్‌ అవుతున్నాం అంటూ కామెంట్‌ చేశాడు. అందుకు అనసూయ స్పందించింది. కమింగ్‌ సూన్‌ అంటూ బుల్లి తెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పింది. అయితే రెగ్యులర్‌ షో తో రానుందా లేదంటే ఏదైనా ప్రత్యేక షో ద్వారా రాబోతుందా అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. జబర్దస్త్‌ వంటి కామెడీ షో తో మరోసారి అనసూయ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అనసూయ మాత్రం బుల్లి తెరపై ఎక్కువ సమయం కేటాయించకుండా వెండి తెరపై ఎక్కువ సినిమాల్లో కనిపించాలనే ఉద్దేశంతో సినిమాలు చేస్తుంది. బుల్లి తెర నుంచి వస్తున్న ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తూ వస్తుంది.