కులం ఏంటో తెలియకుండానే.. 8 ఏళ్లు అలా : అనసూయ
By: Tupaki Desk | 22 Sep 2023 6:14 AM GMTబుల్లితెర మీద బిజీ యాంకర్ గా ఉన్న అనసూయ తన రూట్ మార్చి ఇప్పుడు సినిమాల్లో బిజీ నటిగా మారింది. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వస్తున్న అనసూయ లేటెస్ట్ గా శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన పెదకాపు 1 సినిమాలో నటించింది. సినిమాలో తనది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెబుతున్న అనసూయ తన పాత్ర గురించి మాత్రం రివీల్ చేయట్లేదు. రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా అనసూయ ఈ సినిమాకు నిజమైన హీరో అని అన్నారు.
పెదకాపు ప్రమోషన్స్ లో పాల్గొన్న అనసూయ తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. పెదకాపు అంటే ఊరికి పెద్దగా ఉండే వ్యక్తి అని.. ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుందని కానీ తనకు పర్సనల్ గా అసలు అలాంటివి ఉండవని.
తన భర్తతో 8 ఏళ్లు కలిసి ఉన్నా ఎప్పుడు తనది ఏ కులం అని అడగలేదని అన్నారు అనసూయ. తాళి కట్టే ముందు అతను బ్రాహ్మణుడు అని తెలిసిందని ఆ తర్వాత కూడా మా మధ్య ఎప్పుడు కులం గురించి డిస్కషన్ రాలేదని అన్నారు అనసూయ.
పెళ్లి పత్రిక రాసే టైం లో భరధ్వాజ్ బ్రాహ్మణుడు అని తెలిసింది మా మాధ్య కేవలం సినిమాలు, ఫుడ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీకి సంబంధించిన చర్చ తప్ప మరో డిస్కషన్ రాదని అన్నారు అనసూయ. ఇక సినిమాల్లో తను పోషించిన పాత్రల గురించి పిల్లలు అడుగుతుంటారని అయితే తనకు చెప్పాలని అనిపిస్తే వాటి గురించి చెబుతానని లేదంటే భరధ్వాజ్ ని చెప్పమంటానని అన్నారు అనసూయ.
కొన్ని విషయాలు దాచకుండా చెప్పేస్తాను. లౌక్యం తెలియదు అందుకే ఇప్పుడిప్పుడే దాన్ని మార్చుకుంటున్నానని.. ఏం మాట్లాడాలి.. ఎంత మాట్లాడాలి. అని నేర్చుకుంటున్నా అని అన్నారు అనసూయ. తన దాకా వచ్చిన ఎలాంటి పాత్ర అయినా మెప్పిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న అనసూయ పెదకాపు 1 లో కూడా సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు. సుకుమార్ చేసే ప్రతి సినిమాలో అనసూయకి ఒక మంచి పాత్ర ఉంటుంది. పుష్ప 1 లో దాక్షాయణి తో షాక్ ఇచ్చిన అనసూయ పార్ట్ 2లో ఆ పాత్ర విశ్వరూపం చూపిస్తుందని తెలుస్తుంది. సినిమాలు వెబ్ సీరీస్ స్మాల్ స్క్రీన్ వదిలి పెట్టినందుకు ఆమెకు న్యాయం జరుగుతుంది.