Begin typing your search above and press return to search.

బికినీ లో కంటే ఇలా చీరలోనే బాగున్నారు మేడం

గతంలో బికినీ ఫోటోలు, హాట్ ఫోటోలు షేర్ చేసిన అనసూయ తాజాగా చీర కట్టు ఫోటోలతో కన్నుల విందు చేసింది

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:30 PM GMT
బికినీ లో కంటే ఇలా చీరలోనే బాగున్నారు మేడం
X

జబర్దస్త్‌ మాజీ యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అనసూయ ఏ ఫోటోలు మరియు వీడియో లు షేర్ చేసినా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అనసూయ తన ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది.


గతంలో బికినీ ఫోటోలు, హాట్ ఫోటోలు షేర్ చేసిన అనసూయ తాజాగా చీర కట్టు ఫోటోలతో కన్నుల విందు చేసింది. చాలా మంది నెటిజన్స్ అనసూయ మేడం గారు బికినీ లో, స్కిన్‌ షో ఔట్ ఫిట్ లో కంటే కూడా ఇలా చీర కట్టులోనే చాలా అందంగా కన్నుల విందుగా కనిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బ్లాక్ చీర లో అనసూయ మేడంను ఇలా చూస్తూ ఉంటే చూపు తిప్పుకోవాలి అనిపించడం లేదు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఎప్పటిలాగే అనసూయ చీర కట్టు ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

అనసూయ ఎక్కువగా మోడ్రన్ డ్రెస్ ల్లో కంటే చీర కట్టు ఫోటోలతోనే వైరల్‌ అయింది. చీర కట్టు ఫోటోలు మరోసారి ముద్దుగుమ్మ అనసూయ అందంను చెప్పకనే చెప్పాయి అన్నట్లుగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అనసూయ చీర కట్టులో పడుచు అమ్మాయిగా కనిపిస్తుందని కామెంట్స్ వస్తున్నాయి.