Begin typing your search above and press return to search.

చీరకట్టులో అనసూయ అందం.. స్టన్నింగ్ లుక్

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తిరుగులని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ అనసూయ.

By:  Tupaki Desk   |   13 July 2024 4:51 AM GMT
చీరకట్టులో అనసూయ అందం.. స్టన్నింగ్ లుక్
X

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తిరుగులని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ అనసూయ. ఈ బ్యూటీ న్యూస్ రీడర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత జబర్దస్త్ కామెడీ షోద్వారా యాంకర్ గా బుల్లితెరపై ప్రస్థానం మొదలు పెట్టింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ యాంకర్ గా అనసూయ తన ఇమేజ్ పెంచుకుంది. క్షణం సినిమాతో వెండితెరపైకి నటిగా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే విమర్శకులు ప్రశంసలు సొంతం చేసుకుంది.

రామ్ చరణ్ రంగస్థలం సినిమా అనసూయ కి ఏకంగా స్టార్ యాక్టర్ గా ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత నటిగా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. పుష్ప సినిమాలో కీలక పాత్రలో కనిపించిన అనసూయ ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ మూవీలో కూడా నటించింది. అలాగే మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా అనసూయ నటిగా మంచి అవకాశాలు సొంతం చేసుకుంటుంది.

అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్స్ షేర్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా తన ఫ్యామిలీతో కలిసి వెళ్లే వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను అనసూయ షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తనపైన ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే వెంటనే ఇన్స్టాగ్రామ్ లో రియాక్ట్ అవ్వడం అనసూయ నైజం. అనసూయ ముక్కుసూటిగా తనదైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ విశేషంగా అభిమానులను సొంతం చేసుకుంది.

అలాగే ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ అనంతపురంలో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళింది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను అనసూయ ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ ఫోటోలలో చక్కని చీరకట్టుతో అందంగా ముస్తాబై అనసూయ కనిపించడం విశేషం. ఆమె లుక్స్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి.

హీరోయిన్స్ కి సైతం పోటీ ఇచ్చే అందంతో అనసూయ ఈ ఫోటోలలో మెరిసిపోతోందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది. అందానికి ఆభరణంగా ఆమె రూపం ఉందని ఫ్యాన్స్ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాతో పాటు మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది. అలాగే వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది.