ఆమె నవ్వితే నవరత్నాలు ఏరుకోవాలి!
బ్లూ స్లీవ్ లెస్ బ్లౌజ్ కాంబినేషన్ చీరలో అనసూయ ఎంతో అందంగా కనిపిస్తోంది. నీలి రంగు గులాబీల అల్లికతో రూపొందించిన డిజైనర్ శారీ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 8 Aug 2024 4:54 PM GMTఅవును.. ఆమె నవ్వితే నవరత్నాలు ఏరుకోవాలి. ఆ అందమైన నవ్వు హృదయాలను గెలుచుకుంది. తన ప్రతిభకు ప్రత్యేకించి అభిమానులున్నారు. అందుకే బుల్లితెర యాంకర్ గా, పెద్ద తెర నటిగా ఓ వెలుగు వెలుగుతోంది.
టాలీవుడ్ లో క్షణం తీరిక లేని నటీమణుల్లో ఒకరిగా ఆమె పేరు మార్మోగుతోంది. ఆమె ఎవరో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ది గ్రేట్ అనసూయ గురించే ఇదంతా.
యాంకర్ కం క్యారెక్టర్ నటి అనసూయ తన ఫ్యామిలీ లైఫ్‌ని వర్క్ లైఫ్‌తో బ్యాలెన్స్ చేస్తూ రైడ్ ని కొనసాగిస్తున్న సంగతి అభిమానులకు తెలిసిందే. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కానీ పర్సనల్ లైఫ్ కి ప్రాధాన్యతనిస్తుంది. పనిలోపనిగా అనసూయ లేటెస్ట్ ఫోటోషూట్లు యువతరంలో వైరల్ గా దూసుకెళుతున్నాయి. తాజాగా అనసూయ శారీ లుక్ ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
బ్లూ స్లీవ్ లెస్ బ్లౌజ్ కాంబినేషన్ చీరలో అనసూయ ఎంతో అందంగా కనిపిస్తోంది. నీలి రంగు గులాబీల అల్లికతో రూపొందించిన డిజైనర్ శారీ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందమైన నవ్వు.. ఆ మత్తు కళ్లతో యువహృదయాల్లో ఊహించని మ్యాజిక్ చేస్తోంది అనసూయ.
ప్రస్తుతం ఈ ఫోటోషూట్ వైరల్ గా షేర్ అవుతోంది. ఇటీవల సినిమాలతో బిజీ అయిన అనసూయ బుల్లితెరపై జోరు తగ్గించిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాల్లో నటిస్తోంది. తదుపరి పుష్ప 2లో అనసూయ గ్లింప్స్ గురించి అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.