Begin typing your search above and press return to search.

అనసూయ మేడం స్టన్నింగ్‌ లుక్‌ వైరల్‌

సన్నగా, నాజూకుగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించే అనసూయ తాజాగా ఈ ఫోటోలను షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   10 Aug 2024 2:30 PM GMT
అనసూయ మేడం స్టన్నింగ్‌ లుక్‌ వైరల్‌
X

జబర్దస్త్‌ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. యాంగర్ గా మంచి ఫామ్‌ లో ఉన్న సమయంలోనే రెండో కొడుక్కు జన్మనిచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత కెరీర్‌ లో కాస్త తగ్గే అవకాశం ఉందని కొందరు అనుకున్నారు. కానీ పిల్లలు పుట్టడం అనేది గ్లామర్‌ ప్రపంచంలో అడ్డు కాదు అన్నట్లుగా ఈ అమ్మడు భావించింది. ఇద్దరి పిల్లలు పెద్ద వారు అవుతున్నా కూడా తన కెరీర్‌ లో ఎలాంటి మార్పు లేకుండా ముందుకు సాగుతూ వచ్చింది. తాజాగా ఈ అమ్మడు సినిమాలతో చాలా బిజీ అయిన విషయం తెల్సిందే.

అనసూయ అందం విషయంలో హీరోయిన్స్ కి పోటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసేంత ప్రతిభ మరియు అందం ఆమె సొంతం. అయితే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ, అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో మెప్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఆకట్టుకునే అందం తో రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో సందడి చేసే అనసూయ మరోసారి తన అందాల ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అనసూయ ఫోటో షూట్‌ పిక్స్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు వావ్‌ అంటూ నోరు వెళ్లబెడుతున్నారు.

సన్నగా, నాజూకుగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించే అనసూయ తాజాగా ఈ ఫోటోలను షేర్‌ చేసింది. ఊంచి వాలీ హీల్ పెహెన్ కర్ అంటూ ఫోటోలతో కామెంట్‌ పెట్టింది. విభిన్నమైన ఔట్‌ ఫిట్ తో రెగ్యులర్ గా వార్తల్లో ఉంటున్న అనసూయ మేడం ని ఇలా మరింత అందంగా చూడటం బాగుంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందంగా ఉన్న అనసూయ ఇతర భాషల్లో ప్రయత్నిస్తే కచ్చితంగా యంగ్‌ హీరోలకు హీరోయిన్‌ గా నటించే అవకాశాలు కూడా దక్కవచ్చు అనే అభిప్రాయం ను కొందరు ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు.

సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మెప్పించిన అనసూయ ఆ తర్వాత చేసిన ప్రతి సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అంతే కాకుండా పుష్ప సినిమాలో ఈమె పోషించిన పాత్రకు ప్రతి ఒక్కరు వావ్‌ అన్నారు. ప్రస్తుతం అందరి దృష్టి కూడా పుష్ప 2 పై ఉంది. మొదటి పార్ట్‌ తో పోల్చితే రెండో పార్ట్‌ లో ఈమె మరింత ప్రాముఖ్యత ఉన్న పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆమె సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు. పుష్ప 2 కంటే ముందు పలు చిత్రాలతో అనసూయ ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది.