Begin typing your search above and press return to search.

ముఖంపై గాయాలతో అనసూయ

టాలీవుడ్ స్టార్ యాక్టర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   9 Aug 2024 6:26 AM GMT
ముఖంపై గాయాలతో అనసూయ
X

టాలీవుడ్ స్టార్ యాక్టర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా ఆమె తనకి సంబందించిన అన్ని అప్డేట్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక వాటిపై నెటిజన్స్ రియాక్ట్ అయ్యే విధానం మరింత వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా అనసూయ పెట్టే పోస్ట్ లు, ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే అనసూయ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ముఖంపైన గాయాలతో రక్తం కారుతున్న ఫోటోని షేర్ చేసింది.

ఈ ఫోటో చూడగానే అనసూయ మీద ఎవరో దాడి చేశారా లేదంటే ఆక్సిడెంట్ అయ్యిందా అని అందరూ అనుకున్నారు. నిజానికి ఈ ఫోటో ఆమె నటించిన సింబ సినిమాలోని వర్కింగ్ స్టిల్. ఈ చిత్రంలో అనసూయ యాక్షన్ సన్నివేశాలలో కూడా నటించింది. విలన్ గ్యాంగ్ తో ఫైట్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి. వీటిలో నేచురాలిటీ కోసం అనసూయ దెబ్బలు తగిలినట్లు మేకప్ వేసుకుంది.

ఈ పిక్స్ ని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సింబ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూవీ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జగపతి బాబు కీలక పాత్రలో ఉండటంతో సినిమాపై కొంత హైప్ క్రియేట్ అయ్యింది. చాలా కాలం తర్వాత అనసూయ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూసారు. సినిమాలో అక్షిక అనే స్కూల్ టీచర్ పాత్రలో అనసూయ నటించింది. ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది.

ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చిందని చెబుతూ ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ ఈ మేకప్ ఫొటోస్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన తర్వాత అనసూయ ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చాలా డెడికేటెడ్ స్టార్ అంటూ పొగిడేస్తున్నారు. సింబ మూవీ కచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ పెట్టారు.

నిజంగానే అనసూయ ఎంచుకుంటున్న పాత్రలే ఆమెని బెస్ట్ నటీమణి గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. క్షణం సినిమా నుంచి సింబ వరకు ప్రతి సినిమాలోకి పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉన్న పాత్రలలోనే అనసూయ కనిపించింది. నెక్స్ట్ ఆమె నుంచి రాబోయే సినిమాలలో కూడా బలమైన పాత్రలు చేస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా పుష్ప 2లో కూడా చాలా పవర్ఫుల్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.