Begin typing your search above and press return to search.

నీలిరంగు చీరలో అందాల అనసూయ

సోషల్ మీడియా యుగంలో తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ షో విషయంలో తగ్గేది లే అంటూ హాట్ హాట్ అందాలతో సందడి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 10:25 AM GMT
నీలిరంగు చీరలో అందాల అనసూయ
X

సోషల్ మీడియా యుగంలో తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ షో విషయంలో తగ్గేది లే అంటూ హాట్ హాట్ అందాలతో సందడి చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా అందాల ఫోటోలని అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సినంత ట్రీట్ ఇస్తున్నారు. బుల్లితెర మహారాణులు సైతం గ్లామర్ షోకి సై అంటున్నారు. వీరికి రోల్ మోడల్ ఎవరంటే వెంటనే యాంకర్ అనసూయ అని చెబుతారు.


టెలివిజన్ పై యాంకరింగ్ అంటే అనసూయకి ముందు, అనసూయ తర్వాత అని చెప్పొచ్చు. అంతకు ముందుకి మాటలతో గారడీ చేసే యాంకరమ్మలు తరువాత అందంతో ఆకర్షిస్తూ కుర్రాళ్ళు కూడా టీవీలకి అతుక్కుపోయేలా చేస్తున్నారంటే అనసూయ వేసిన పునాది అని చెప్పాలి. ఈ బ్యూటీ జబర్దస్త్ తో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసింది.


కామెడీ షోకి కాస్తా కలర్ ఫుల్ షోగా బాగా పాపులర్ కావడానికి అనసూయ అందం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఆ షో అనసూయకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆమె దారిలో తరువాత రష్మీ గౌతమ్ అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది. బుల్లితెర నుంచి అనసూయ క్షణం మూవీతో బిగ్ స్క్రీన్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ అయ్యింది.


రంగస్థలం, పుష్ప సినిమాలు అనసూయని ఏకంగా స్టార్ యాక్టర్ గా మార్చేశాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనసూయ మారిపోయింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలతో పాటుగా తన హాట్ హాట్ ఫోటోషూట్ లని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతాయి..


తాజాగా నీలిరంగు చీర కట్టుకొని అనసూయ దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఆమె అందం కుర్రాళ్ళ మనసులని కొల్లగొట్టే విధంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఫోటోలపై అనసూయ ఇంటరెస్టింగ్ స్టోరీ కూడా రాసింది, ఒక మహిళగా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఒక మహిళగా నన్ను చూసి నేను గర్వపడుతున్నాను. ఒక మహిళగా నన్ను చూసుకొని నేను చాలా ఎగ్జైట్ కి గురవుతున్నాను అంటూ రాసింది.