బేబీ మూవీ.. పాపం అంటున్న అనసూయ
కాగా తాజాగా ఆమె సోషల్ మీడియా లో ట్వీట్ చేసింది. అది కూడా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమా బేబి గురించే అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 15 July 2023 10:41 AM GMTయాంకర్ అనసూయ పరిచయం లేనివారు ఎవరూ లేరు. బుల్లితెరపై తన కెరీర్ ని ప్రారంభించిన ఆమె ఇప్పుడు వెండితెర పై మెరుస్తోంది. మంచి పాత్రల ను ఎంచుకుంటూ నటిగా తన కెరీర్ ని డెవలప్ చేసుకుంటోంది. అంతే కాదు సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోల ను షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఆమె విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. అనసూయ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అంతే విమర్శించేవారు కూడా ఉంటారు. ఏదో ఒక వివాదం లో అనసూయ పేరు వినపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవర కొండ తో వివాదం పెట్టుకోగా అప్పటి నుంచి ఆయన అభిమానులు ఆమెను విమర్శిస్తూనే ఉంటారు.
తన ను వదిలిపెట్టండి అంటూ ఆమె ఎంత వేడుకుంటున్నా వారు ఆమెను విమర్శించడం ఆపడంలేదు. కాగా తాజాగా ఆమె సోషల్ మీడియా లో ట్వీట్ చేసింది. అది కూడా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమా బేబి గురించే అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
'వావ్... నేను వాళ్లకు చాలా ముఖ్యం. నా ప్రమేయం ఉన్నా లేకున్నా నాకు సంబంధం ఉన్నా లేకున్నా... నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదంతే... నా పై అంతా డిపెండ్ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు.. హమ్' అని కామెంట్ చేశారు.
ఆమె ఎవరి పేరు ప్రస్తావించలేదు. కానీ కచ్చితంగా బేబీ మూవీ గురించే అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బేబి ట్రైలర్ విడుదలైనప్పుడు ఆమె దాని ని మెచ్చుకున్నారు. కానీ ఈ మూవీ లో కూడా కొన్ని అభ్యంతరకర పదాలు వాడటంతో దాని పై ఆమె కచ్చితంగా స్పందిస్తారు అని భావించారు. ముఖ్యంగా ఈ ట్వీట్ బేబీ విడుదలైన రోజే చేయడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరి ఈ విషయం పై అనసూయ క్లారిటీ ఇస్తే తప్ప ఈ చర్చలు ఆగేలా కనపడటం లేదు.