Begin typing your search above and press return to search.

ఆర్జీవీని ఫాలో అవుతున్న అనసూయ!?

కావాలనే ఏదో ఒకటి వివాదం క్రియేట్​ చేసేందుకు.. నెటిజన్ల దృష్టిలో పడేలా పోస్ట్​లు పెట్టి.. ఆ తర్వాత వారి చేత ఏదో ఒకటి అనిపించుకుని.. మళ్లీ రియాక్ట్​ అవ్వడం ఆమెకు సర్వసాధరణమైపోయింది" అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:30 AM GMT
ఆర్జీవీని ఫాలో అవుతున్న అనసూయ!?
X

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్​ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు దర్శకుడు రామ్​ గోపాల్ వర్మ. కానీ ఇప్పుడు ఆయనతో పాటు మరో నటి అనసూయ కూడా చేరిందా అని అనిపిస్తుంది అంటున్నారు సోషల్ మీడియా జనం . ఎందుకంటే ఇప్పుడు ఆ రేంజ్​లో సోషల్​ మీడియాలో ఆమె పేరు కాంట్రవర్సీలతో మార్మోగిపోతోంది. ముక్కుసూటిగా మాట్లాడటంలో అనసూయ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.

స్మాల్ స్క్రీన్​, సిల్వర్​ స్క్రీన్​పై తనకంటూ స్పెషల్​ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. కాంట్రవర్సీకి కేరాఫ్​ ఆడ్రెస్​ అని చాలా మంది అంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంటుందని చెబుతున్నారు. "నెటిజన్లు అయితే అనసూయకు ఎప్పుడూ కాంట్రవర్సీ కావాలి. అందుకే సోషల్​ మీడియాలో తన పై ఎక్కువ కామెంట్స్​ వచ్చేలా, పబ్లిసిటీ రావడం కోసం ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది.

కావాలనే ఏదో ఒకటి వివాదం క్రియేట్​ చేసేందుకు.. నెటిజన్ల దృష్టిలో పడేలా పోస్ట్​లు పెట్టి.. ఆ తర్వాత వారి చేత ఏదో ఒకటి అనిపించుకుని.. మళ్లీ రియాక్ట్​ అవ్వడం ఆమెకు సర్వసాధరణమైపోయింది" అని చాలా మంది నెటిజెన్స్ అభిప్రాయపడుతుంటారు.

హీరో విజయ్​ దేవరకొండతో వివాదం... ఇలా ఎన్నో విషయాలతో వివాదాలను ఎదుర్కొంటూనే ఉంటుంది. తాజాగా కూడా అలనాటి తారలు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య వేషధారణతో కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే సావిత్రి వేషధారణపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేయగా.. "ఎక్స్‌పోజ్‌ చేసినంత తేలిక కాదు సావిత్రిలా నటించడమంటే. అలానే ఎక్స్‌పోజింగ్‌ చేయడం కూడా తేలిక కాదు. శారీరకంగా మానసికంగా చాలా ప్రిపేర్‌ అవ్వాలి" అని తిరిగి రీకౌంటర్ వేసింది.

ఇలా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేస్తూ.. తనపై నెగెటివ్ కామెంట్స్​ చేసినవారి భరతం పడుతున్నానంటూ అనసూయ చెప్పుకొస్తోందని చాలా మంది అనుకుంటున్నారు. ఆర్జీవి కూడా ఇలానే వివాదాల్ని సృష్టించి పబ్లిసిటీ చేసుకుంటాడు. నువ్వు కూడా ఆయన్నే ఫాలో అవుతున్నావ్​ అంటూ కామెంట్స్​ చేస్తున్నారు. ఏది ఏమయ్యింది ఇలా ట్రోల్ చేసే వాళ్ళని అనసూయ బ్రో డోంట్ కేర్ అని అంటుంది అది వేరే విషయం.