Begin typing your search above and press return to search.

కన్ను గీటిన అనసూయ.. వైట్ శారీలో కిర్రాక్!

అనంతరం జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కనెక్ట్ అయ్యి ఫేమస్ అయింది.

By:  Tupaki Desk   |   14 July 2024 11:42 AM GMT
కన్ను గీటిన అనసూయ.. వైట్ శారీలో కిర్రాక్!
X

అనసూయ.. అందం.. ఈ రెండూ 'అ'తో మొదలైన పదాలే.. అలాగే వాటికి మంచి కనెక్షన్ ఉందంటున్నారు నెటిజన్లు! అందుకు ఆమె పోస్ట్ చేసిన ఫోటోలనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన అనసూయ.. ఆ తర్వాత న్యూస్ ప్రజెంటర్ గా దర్శనమిచ్చింది. అనంతరం జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కనెక్ట్ అయ్యి ఫేమస్ అయింది.


అందాల యాంకర్ గా సూపర్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ షోలో ఓ రేంజ్ లో హంగామా చేస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అలా సినిమా అవకాశాలు అందుకుంది. మూవీస్ లో బిజీగా మారడం వల్ల బుల్లితెర షోస్ కు గుడ్ బై చెప్పేసింది. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. సిల్వర్ స్క్రీన్ పై అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును గ్రాబ్ చేసుకుంటోంది. టాలీవుడ్ దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారిపోయింది అనసూయ!


అయితే సినిమాల్లో నటిస్తూనే.. టీవీ షోల్లో కూడా సందడి చేస్తోంది. వాటితో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. సమాజంలో జరిగే పలు విషయాలపై స్పందిస్తుంటోంది. అలా రెగ్యులర్ గా తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటోంది. తనపై ఎవరైనా తప్పుడు కామెంట్స్ లేదా ట్రోల్స్ చేస్తే ఇచ్చి పడేస్తుంటోంది. నిత్యం నెట్టింట ట్రెండింగ్ లోనే ఉంటోంది.


ఇక ఆమె ఆందాల ఆరబోతకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. మోడ్రన్ ఔట్ ఫిట్స్, చీరల్లో వేరే లెవల్ లో గ్లామర్ షో చేస్తుంటోంది అనసూయ. కుర్రాళ్ల మనసులు దోచేస్తుంటోంది. తన చూపు, నవ్వుతో మాయ చేస్తూ క్లీన్ బౌల్డ్ చేస్తుంటోంది. చీరల్లో వయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్లను ఫ్లాట్ చేస్తోంది. తాజాగా వైట్ కలర్ క్రేజీ శారీలో పిక్స్ దిగింది అనసూయ. బ్లాక్ కలర్ స్పెక్ట్స్ పెట్టుకుని.. ఓ రేంజ్ లో పోజులు ఇచ్చి అందరినీ మైమరిపిస్తోంది.


వయ్యారంగా కూర్చుని ఒక ఫోటోలో, సైడ్ కట్ లో మరో ఫోటోలో అదరగొట్టేసింది. తన శారీపై ఉన్న క్యాప్షన్ చూపిస్తూ ఆకట్టుకుంటోంది. కన్ను గీటి మరీ కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం అనసూయ కొత్త పిక్స్ వైరల్ గా మారగా.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. లైకుల వర్షం కురిపిస్తూ.. కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. క్రేజీ కామెంట్స్ పెడుతూ పిక్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. మరి తెల్ల చీరలో అమ్మడి అందాల జాతరను మీరు చూశారా?