అనసూయ ఇచ్చి పడేసిందిగా!
ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఇంతకీ అనసూయ ఏమందంటే?
By: Tupaki Desk | 5 April 2024 4:47 AM GMTఅనసూయ.. అనూహ్యంగా బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి వరుస సినిమాలతో ప్రస్తుతం దూసుకుపోతోంది. గతేడాది విమానం మూవీతో అలరించిన ఈ బ్యూటీ.. ఇటీవల రజాకార్ సినిమాతో మెప్పించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2తో త్వరలో సందడి చేయనుంది. ఇటీవల తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిందని టాక్. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ.. రంగస్థలం, పుష్ప సినిమాలతో నటిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇక సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది. ఫ్యామిలీ ఫొటోస్, సినిమా అప్డేట్స్ షేర్ చేస్తుంటోంది. ట్రెండీగా ఫోటోలు దిగుతూ పోస్టులు పెడుతుంటోంది. గ్లామర్ షోతో పాటు తన పై ట్రోల్స్ చేసిన వారికి గట్టిగా కౌంటర్లు కూడా ఇస్తుంటోంది. తన పేరును యూజ్ చేస్తూ కామెంట్స్ చేస్తే దిమ్మతిరిగిపోయే రిప్లైలు ఇస్తుంటోంది. తాజాగా ఇలాంటిదే జరిగింది.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి ట్వీట్ చేశాడు ఓ నెటిజన్. ఆ ట్వీట్ చివరలో అనసూయను ఆంటీ అని ప్రస్తావించాడు. ఇది చూసిన అనసూయ ఫుల్ ఫైర్ అయింది. తనదైన స్టైల్ లో ఆ నెటిజన్ కు కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఇంతకీ అనసూయ ఏమందంటే?
"ఎందుకు కార్తిక్ గారు నన్ను అస్తమానం లాగుతుంటారు.. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో ఇప్పటికే నేను ఎప్పుడో చెప్పి చెప్పి వదిలేశాను. అనవసరంగా నేనే హైప్ ఇస్తున్నానని నిజమేనేమో అని వదిలేశాను.. నేను కూడా తెలంగాణ బిడ్డనే.. కానీ నాకు సింపతీ అక్కర్లేదు.. నాకు నా మీద నమ్మకం.. నా దేవుడి మీద నమ్మకం.. మా అమ్మానాన్నలు నాకిచ్చిన విలువలు, పెంపకం నన్ను నా దృష్టిలో ఎప్పుడూ దిగజారనివ్వవు" అని తెలిపింది.
"ఇప్పుడు ఈ ట్వీట్ ను కూడా తమ స్వార్థానికి వాడుకున్నా నేను ఆశ్చర్యపోను. కానీ నాకు వాళ్లకు ఎటువంటి సంబంధం ఎప్పుడూ లేదు. ఇప్పుడూ లేదు.. అన్నట్లు.. నాకు తెలిసి మీరు నేను చుట్టాలు అస్సలు కాదు.. నేను మీకు ఆంటీ కానేమో. మీ ఇంట్లో ఒకసారి అడిగి చూడండి మీకు తెలియకుండా రిలేషన్స్ ఉన్నాయేమో. ఎందుకంటే నాకు చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయని పెద్ద వాళ్లు నేర్పించారు. ఎనీవే.. విషింగ్ యూ వెల్ అండి" అంటూ కౌంటర్ ఇచ్చింది అనసూయ.