Begin typing your search above and press return to search.

కేన్స్ లో ఉత్త‌మ న‌టిగా అన‌సూయ చ‌రిత్ర‌!

'ది షేమ్ లెస్' అనే హిందీ సినిమాలో అత్యుత్త‌మ న‌ట‌న‌కు గానూ ఈ అవార్డు ద‌క్కింది. ఈ చిత్రాన్ని బ‌ల్గేరియా ద‌ర్శ‌కుడు కాన్ స్టాంటిన్ బోజ్ నోవ్ తెర‌కెక్కించారు.

By:  Tupaki Desk   |   26 May 2024 6:38 AM GMT
కేన్స్ లో ఉత్త‌మ న‌టిగా అన‌సూయ చ‌రిత్ర‌!
X

ప్ర‌తిష్టాత్మ‌క కేన్స్ చిత్రోత్స‌వాల్లో భార‌తీయ సినిమా అరుదైన ఘ‌న‌త సాధించింది. 'ఆన్ స‌ర్టెయిన్ రిగార్డ్' విభాగంలో భార‌తీయ న‌టి అన‌సూయ సేన్ గుప్తా ఉత్త‌మ న‌టిగా నిలిచింది. 'ది షేమ్ లెస్' అనే హిందీ సినిమాలో అత్యుత్త‌మ న‌ట‌న‌కు గానూ ఈ అవార్డు ద‌క్కింది. ఈ చిత్రాన్ని బ‌ల్గేరియా ద‌ర్శ‌కుడు కాన్ స్టాంటిన్ బోజ్ నోవ్ తెర‌కెక్కించారు. ఈ విభాగంలో పుర‌స్కారం అందుకున్న తొలి భార‌తీయురాలిగా అన‌సూయ చ‌రిత్ర సృష్టించారు.

విధిలేని ప‌రిస్థితుల్లో పుడుపు వృత్తిని కొన‌సాగిస్తున్న‌వారు, త‌మ హ‌క్కుల కోసం గ‌ళ‌మెత్తిన అణ‌గారి వ‌ర్గాల‌కు ఈ అవార్డు అంకిత‌మంటూ' అన‌సూయ ఉద్వేగానాకి గుర‌య్యారు. అన‌సూయ స్వ‌స్థ‌లం కోల్ క‌తా. జాద‌వ్ పూర్ యూనివ‌ర్శిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో ప‌ట్టా అందుకున్న అనంత‌రం సినిమా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. 2009 లో అంజన్ ద‌త్ తెర‌కెక్కించిన 'మ్యాడ్లీ బెంగాలీ' తో స‌హాయ న‌టిగా ప‌రిచ‌య‌మ‌య్యారు.

అటుపై 2013 లో ముంబైకి వ‌చ్చారు. చాలా సినిమాల్లో చిన్నా చిత‌కా పాత్ర‌లు పోషించారు. స‌రైన అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా మారారు. 'సాత్ ఉంచాకే'..'సార్గెట్ మి నాట్'..'మ‌సాబా మ‌సాబా' చిత్రాల‌కు ప‌నిచేసారు. అన‌సూయకు న‌ట‌న ఒక్క‌టే కాదు. ఆమె మల్టీట్యాలెంటెడ్. న‌ట‌న‌తో పాటు, సాహిత్యం, చిత్ర‌లేఖ‌నం వంటి రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. ఆమెలో ఈ ట్యాలెంట్ ని చూసే య‌శ్ దీప్ అనే యువ‌కుడు ప్రేమించాడ‌ని అంతా అంటుంటారు.

ఇద్ద‌రు పెళ్లి చేసుకుని గోవాలో స్థిర‌ప‌డ్డారు. అదంతా సినిమాల‌కు దూర‌మ‌య్యే ద‌శ‌లో జ‌రిగింది. అదే స‌మ‌యంలో ఫేస్ బుక్ ద్వారా ద‌ర్శ‌కుడు కాన్ స్టాంటిన్ ప‌రిచ‌య‌మ‌య్యారు. 2020 లో 'ది షేమ్ లేస్' ఆడిష‌న్ కి పిలిచారు. సెల‌క్ట్ అవ్వ‌డంతో ఆమె మెయిన్ లీడ్ గా ఆ చిత్రాన్ని తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇప్పుడు భార‌త్ సైతం మీసం మెలేసాలా గొప్ప స్థానానికి తీసుకెళ్ల‌డం విశేషం.