జిమ్ లో అనసూయ.. స్టన్ అయ్యేలా..
అనసూయ రావటంతో యాంకరింగ్ కి గ్లామర్ అనే కొత్త అర్ధం వచ్చిందని చెప్పవచ్చు.
By: Tupaki Desk | 8 Jun 2024 8:31 AM GMTఅనసూయ భరద్వాజ్ యాంకర్ గా కంటే ఇప్పుడు నటిగానే మరింత క్రేజ్ అందుకుంటోంది. ఈ సుందరిని మొదట బుల్లితెరపై చూసి ప్రేక్షకులు ఎంతగానో అభిమానించటం ప్రారంభించారు. అయితే ఆమె కేవలం మంచి మాటలతోనే కాకుండా, తన గ్లామర్ తో కూడా ప్రేక్షకుల మనసు దోచేసింది. అనసూయ రావటంతో యాంకరింగ్ కి గ్లామర్ అనే కొత్త అర్ధం వచ్చిందని చెప్పవచ్చు.
అనసూయ బుల్లితెరపై తన ప్రతిభను చూపిస్తూ, క్రేజ్ ని బిగ్ స్క్రీన్ కి తీసుకువెళ్ళింది. ఆమె నటనలో కొత్త తరహా ప్రయోగాలు చేస్తూ, పవర్ఫుల్ పాత్రల్లో కనిపించడం, తన కెరీర్ కు కొత్త మలుపు తెచ్చింది. సాధారణ పాత్రలకు మాత్రమే కాకుండా, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం ద్వారా అనసూయకు వరుస అవకాశాలు వస్తున్నాయి.
జబర్దస్త్ షో తో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ, ఆ తరువాత వివిధ షోల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. క్షణం సినిమాలో చేసిన మంచి పాత్రతో ఆమె కెరీర్ కొత్త మలుపు తిరిగింది. ఈ సినిమా ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ పాత్ర ద్వారా ఆమెకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది.
అనసూయ ఎక్కడికెళ్లినా అభిమానులు రంగమ్మత్త అని పిలుచుకుంటూ ఆమెపై ప్రేమను చూపిస్తారు. ఈ పాత్ర ఆమె కెరీర్ కు ఎంతో బలం చేకూర్చింది. అనసూయ గ్లామర్ షో ద్వారా తన వయసును తగ్గించుకుంటూ, యవతను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఆమె ఒక మిర్రర్ సెల్ఫీతో ఆకట్టుకుంది. ఈ గ్లామర్ లుక్స్ లో కూడా అమ్మడు ఎంతో అందంగా ఉందని అంటున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. అలాగే మరో రెండు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ లో కూడా నటిస్తున్నారు. ఆమె ప్రతి పాత్రలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తూ, ప్రేక్షకుల మనసును గెలుచుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్ తన ప్రతిభతో మరియు గ్లామర్ తో యాంకరింగ్ మరియు నటనలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించారు. మరి రాబోయే రోజుల్లో ఆమె ఇంకా ఎలాంటి అవకాశాలు అందుకుంటారో చూడాలి.