ట్రెడిషన్ లుక్కులో అనసూయ అందాల సెగలు..
రీసెంట్గా ఆమె ఒకవైపు ట్రెడిషనల్ లుక్ తో కనిపిస్తూనే మరొకవైపు తన గ్లామర్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ మనసులను దోచేసింది.
By: Tupaki Desk | 28 Feb 2024 11:30 AM GMTయాంకర్ అనే పదానికి గ్లామర్ సరికొత్త అర్దాన్ని తీసుకువచ్చిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఒకప్పుడు యాంకర్ అంటే మాటలతో టైమింగ్ పంచ్ లతో ఆకట్టుకునేవారు. కానీ అనసూయ ఎంట్రీ ఇచ్చిన తరువాత మరో ట్రెండ్ మొదలైంది. అమ్మడి అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. పోటీగా ఎంతమంది గ్లామరస్ యాంకర్లు వచ్చినా ఆమెకు ధీటుగా మాత్రం నిలవడం లేదు.
బుల్లితెర నుంచి ఆమె క్రేజ్ బిగ్ స్క్రీన్ కు చేరింది. నటనలోను అనసూయ కొత్త తరహా ట్రెండ్ ఫాలో అవ్వడం బాగా కలిసొచ్చింది. కేవలం రెగ్యులర్ పాత్రలు చేయకుండా పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం జబర్దస్త్ షో తోనే బిజీగా కనిపించిన అనసూయ ఆ తర్వాత వివిధ రకాల షోలు చేసింది.
అనంతరం క్షణం సినిమాలో ఆమె చేసిన ఒక మంచి పాత్రతో కెరీర్ మలుపు తిరిగింది. పుష్ప సినిమాతో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అంతకుముందు రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర కూడా ఆమె కెరీర్ కు మరింత బలాన్ని ఇచ్చింది.
అనసూయ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ రంగమ్మత్త అంటూ ముద్దుగా పిలుచుకుంటు ఉంటారు. అంతలా ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ చూపించింది. ఇక అనసూయ గ్లామర్ షో తో ఎప్పటికప్పుడు తన వయసును తగ్గించుకుంటూనే కనిపిస్తోంది. రీసెంట్గా ఆమె ఒకవైపు ట్రెడిషనల్ లుక్ తో కనిపిస్తూనే మరొకవైపు తన గ్లామర్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ మనసులను దోచేసింది.
లంగా వోని లో స్పెషల్ ఫోటోషూట్ లో కనిపించిన అనసూయ భరద్వాజ్ నెవ్వర్ బిఫోర్ అనే విధంగా తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. తన చిరునవ్వుతో కూడా ఒక విధంగా మాయ చేసింది అని చెప్పవచ్చు. ఎండలో తన అందాల సెగలతో గతంలో ఇప్పుడు లేనంత గ్లామర్ తో దర్శనమిచ్చింది. ఇక ఈ ఫోటోలు నిమిషాల్లోనే వైరల్ అయిపోయాయి. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. అలాగే ఒక రెండు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు కూడా చేస్తోంది.