కమల్ 237.. అంచనాలకు మించి..!
థగ్ లైఫ్ సినిమాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ యాడ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 26 Dec 2024 7:24 AM GMTలోకనాయకుడు కమల్ హాసన్ ఇండియన్ 2తో నిరాశపరచగా తన నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలతో ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. కమల్ ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ లో 236వ సినిమాగా థగ్ లైఫ్ ని చేస్తున్నాడు. మణిరత్నం, కమల్ ఈ క్రేజీ కాంబో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చికాగోలో జరుగుతుంది. థగ్ లైఫ్ సినిమాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ యాడ్ చేస్తున్నారు. సినిమాలోని ఈ టెక్నాలజీ కోసం చికాగోలో టైం స్పెండ్ చేస్తున్నారు.
ఇక దీనితో పాటు కమ 237వ సినిమా సెట్స్ మీదకు త్వరలో తీసుకెళ్లనున్నారు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. యాక్షన్ డైరెక్టర్స్ అన్బరివులు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటివరకు కమల్ సినిమాల్లో ఎప్పుడు రానటువంటి క్రేజీ యాక్షన్ సినిమాగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఐతే కమల్ 237 సినిమా ఆల్రెడీ ప్రకటన రాగా చికాగోలో ఉన్న కమల్ ని కలిసి సినిమాకు సంబందించిన మరిన్ని విషయాలు చర్చించారు అన్బరివులు.
కమల్ అన్బరివులు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాను ఎక్కడ క్రాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాపై ఆడియన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా దానికి మించి సినిమా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా కమల్ లోని వర్సటాలిటీ పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకునేలా ఈ సినిమా కథ కథనాలు రాసుకున్నారని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాపై అంచనాలు లెక్కకు మించి ఉన్నాయని తెలుస్తుంది.
కమల్ కూడా విక్రం సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత తన ఆలోచన మార్చుకున్నారు. ఆడియన్స్ కి వెరైటీ కథలు.. సర్ ప్రైజింగ్ సినిమాలు అందిస్తే తప్పకుండా ఆదరిస్తారని ఫిక్స్ అయ్యారు. అందుకే థగ్ లైఫ్ తో పాటు అన్బరివులు తో కలిసి మరో యాక్షన్ సినిమాకు రెడీ అవుతున్నారు. కమల్ సినిమాలు రిజల్ట్ ఎలా ఉన్నా వాటిలో ఆయన మాత్రం అదరగొట్టేస్తారు. కథ విషయంలో కాస్త జాగ్రత్త పడితే మిగతా అంతా తెర మీద కమల్ విశ్వరూపం చూపిస్తారు. విక్రం తర్వాత మళ్లీ సినిమాల ఫలితాలు నిరాశ పరుస్తున్నా రాబోతున్న సినిమాలతో కమల్ మళ్లీ హిట్ టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది.