యాంకర్ స్రవంతి.. వైట్ షర్ట్ లో గ్లామర్ బ్లాస్ట్..
యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి అందరికీ తెలిసిందే. కొన్ని నెలలుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆమె పేరు గట్టిగానే వినిపిస్తోంది.
By: Tupaki Desk | 14 Dec 2024 11:19 AM GMTయాంకర్ స్రవంతి చొక్కారపు గురించి అందరికీ తెలిసిందే. కొన్ని నెలలుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆమె పేరు గట్టిగానే వినిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాల ఈవెంట్స్ లో హోస్ట్ గా ఎక్కువగా అమ్మడే కనిపిస్తున్నారు. అనేక టీవీ షోలు, సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు, వివిధ మూవీ ఫంక్షన్స్ తో బిజీగా బిజీగా గడుపుతున్నారు ముద్దుగుమ్మ.
ఇక సోషల్ మీడియాలో స్రవంతికి క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది. స్టార్ట్ హీరోయిన్స్ ను మించిన అందంతో సందడి చేస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ ను పోస్ట్ చేస్తుంటారు. ఫుల్ యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంటారు. ఫాలోవర్స్ ను ఎప్పుడూ డిస్సాపాయింట్ చేయరు. అటు మోడ్రన్ గా.. ఇటు ట్రెడిషనల్ గా కనిపిస్తూ మెప్పిస్తుంటారు.
గ్లామరస్ గా కనిపిస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తుంటారు. తన పిక్స్ తో సెగలు రేపుతుంటారు. అలా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు. తాజాగా కొత్త ఫోటోస్ ను షేర్ చేశారు. జీన్ అండ్ షర్ట్ లో అందాలు ఆరబోశారు. టోర్న్ జీన్ వేసుకున్న అమ్మడు.. వైట్ కలర్ షర్ట్ తో గ్లామర్ షో చేశారు. ఆ షర్ట్ పై ఉన్న లిప్స్ సింబల్స్ తో అట్రాక్ట్ చేస్తున్నారు.
క్రేజీగా జడ వేసుకున్న స్రవంతి.. తన లుక్స్ తో ఫిదా చేశారు. తన అందాలతో మైండ్ బ్లాక్ చేశారు. రకరకాల పోజులతో ఫ్లాట్ చేశారు. అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె పిక్స్ ఫుల్ వైరల్ గా మారాయి. మేడమ్ సర్ మేడమ్ అంతే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిక్స్ సూపర్ అని చెబుతున్నారు.
అయితే మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన స్రవంతి.. ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారారు. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అనేక మంది సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూస్ చేసి పాపులర్ అయ్యారు. పలు టీవీ ఛానెల్స్ లో వచ్చిన ప్రోగ్రామ్స్ లో సందడి చేశారు. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప టీమ్ తో చేసిన ఇంటరాక్షన్ తో లైమ్ లైట్ లోకి వచ్చారు.
ఆ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే ఛాన్స్ అందుకున్నారు. ఆ షోతో తెలుగు వారికి బాగా చేరువయ్యారు. తన అందం, ఆటతో అలరించారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక.. యాంకర్ గా ఫుల్ బిజీ అయిపోయారు. సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్స్ దక్కించుకున్నారు.