Begin typing your search above and press return to search.

అనసూయలో సడెన్​ ఛేంజ్​.. ఇలా మారిపోయిందేంటి?

హాట్ అండ్ బోల్డ్ యాంకర్ కమ్​ యాక్టర్​ అనసూయ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   14 Aug 2023 10:30 AM GMT
అనసూయలో సడెన్​ ఛేంజ్​..  ఇలా మారిపోయిందేంటి?
X

హాట్ అండ్ బోల్డ్ యాంకర్ కమ్​ యాక్టర్​ అనసూయ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్​గా కెరీర్ ప్రారంభించి బుల్లితెరకే అందాన్ని తీసుకువచ్చింది. తన యాంకరింగ్​కు గ్లామర్ సొగసులు అద్ది.. ఆ తర్వాత యాక్టర్​గా మారింది.


సోషల్​మీడియాలోనూ ఎప్పుడూ ఫుల్ యాక్టివ్​గా ఉండే ఈ భామ.. ఎప్పుడూ తన కాంట్రవర్సీ ట్వీట్లతో హాట్ టాపిక్​గా మారుతుంటుంది. కానీ గత కొద్ది రోజులుగా తన తీరు మార్చుకుంది. ఆమెలో చాలా మార్పు వచ్చింది. తాజాగా ఆమె మరో ట్వీట్ చేసి ప్రస్తుతం సోషల్​మీడియాలో ఫుల్​ ట్రెండ్ అవుతోంది. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆమె.. దేశం కోసం పోరాడిన యోధురాలు బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌ను గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ చేసింది. ఆమె ఫొటోస్​ను రీక్రియేట్​ చేస్తూ నివాళులు అర్పించింది.

"1857 కాలం నాటి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధురాలు, ఆవాధీ క్వీన్ బేగం హ‌జ్‌ర‌త్ మ‌హ‌ల్‌.. దేశం కోసం పోరాడిన తీరుకు గుర్తుగా 1984 మే 10న ఆమె ఫొటోతో ప్ర‌భుత్వం ఓ స్టాంప్‌ను విడుదల చేసింది. తన పోరాట పటిమతో మనలో స్ఫూర్తిని నింపిన ఆమె స్మరించుకుందాం. ఈ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌ర్చిపోయిన ఆమె పోరాట శక్తిని గుర్తుచేసుకుందాం" అంటూ వరుస ట్వీట్లు చేసింది అన‌సూయ‌ భరద్వాజ్.

1857 క్విట్ ఇండియా ఉద్యమంలో భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొని దేశం కోసం తమ ప్రాణాలను విడిచారు. అయితే ఈ మూమెంట్​లో పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా కీలక పాత్ర పోషించారు. వారిలోనే ఒకరు హజ్రత్ మహల్. తన ధైర్యసాహసాలతో బ్రిటిష్ పాలకుల నుంచి అవధ్‌ విముక్తి కోసం పోరాటం చేసి మహా యోధురాలు బేగం హజ్రత్ మహల్. ఆమెను అభినవ లక్ష్మీభాయిగా అభివర్ణిస్తుంటారు.

ఇప్పుడామె రూపంతో ఉన్న ఫొటోలను తమ ముఖంతో రీక్రియేట్ చేస్తూ సోషల్​మీడిలో అనసూయ పోస్ట్ చేసింది. ఆ పిక్స్​ ప్రస్తుతం నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఆమె సినిమాల విషయానికొస్తే.. రీసెంట్​గా ఆమె విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చంది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్​లో సంచలనం సృష్టించిన పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటే ఫ్లాష్ బ్యాక్ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తోంది.