Begin typing your search above and press return to search.

భర్తతో విడాకులు.. యాంకర్ హరితేజ కామెంట్స్​ వైరల్

ప్రస్తుతం ఈ బ్యూటీ ఆస్ట్రేలియాలో సింగిల్‌గానే వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోంది. కుమార్తెను కూడా తన తల్లి దగ్గర వదిలి మరీ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది

By:  Tupaki Desk   |   30 Sep 2023 7:23 AM GMT
భర్తతో విడాకులు.. యాంకర్ హరితేజ కామెంట్స్​ వైరల్
X

అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి, యాంకర్. హరి తేజ. ఆన్‌ స్క్రీన్‌ అయినా ఆఫ్‌ స్క్రీన్‌ అయినా మహా చలాకీగా ఉంటూ.. పంచ్‌ డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తుంటుంది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ షోలో పాల్గొని ప్రేక్షకుల్లో, నెట్టింట్లో మరింత క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా తన డివొర్స్​ గురించి మాట్లాడింది.


ప్రస్తుతం ఈ బ్యూటీ ఆస్ట్రేలియాలో సింగిల్‌గానే వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోంది. కుమార్తెను కూడా తన తల్లి దగ్గర వదిలి మరీ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. చిట్ చాట్ సెషన్ చేసింది.

వీరిలో ఒక నెటిజన్.. భర్త దీపక్​తో విడాకులు తీసుకున్నారా.. ? అంటూ హరితేజను ప్రశ్నించారు, దీనికి హరితేజ నవ్వుతూ ఎంతో హుందాగా తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. నాలుగు రోజులు నెట్టింట యాక్టివ్‌ లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే అంటూ గట్టిగా సమాధానం చెప్పింది.

'నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్​గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే'.. అంటూ రాసుకొచ్చింది. తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. తన విడాకుల కామెంట్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. దీంతో ఆమె డివొర్స్ వార్తలు నిజం కాదని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇంకో నెటిజన్​ కూడా.. సీరియల్‌ నటి నవ్యతో విడిపోయారా..? అంటూ అడగగా.. అది అవదమ్మా.. అంటూ హరి తేజ సమాధానం ఇచ్చింది. తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఎంతో స్ట్రాంగ్ అని చెప్పింది. కాగా, సెటైరికల్‌ కామెంట్స్‌తో మరో సూర్య కాంతంలా హరితేజ గుర్తింపు సంపాదించుకుందంటూ అప్పట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ప్రశంసించారు. ఈమె అఆ, యూ ట‌ర్న్, అరవింద సమేత వీర రాఘవ, సరిలేరు నీకెవ్వరూ, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో నటించింది.