Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రెడ్‌ చీరలో అందాల దివి కవ్వింపులు

టాలీవుడ్‌ లో ఉన్న చాలా మంది హీరోయిన్స్‌ తో పోల్చితే దివి అంతకు మించి అందంగా ఉంటుందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 5:12 AM GMT
పిక్ టాక్ : రెడ్‌ చీరలో అందాల దివి కవ్వింపులు
X

తెలుగు బిగ్‌ బాస్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ దివి ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోయిన్స్ ను సైతం బీట్‌ చేసేంతటి అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. టాలీవుడ్‌ లో ఉన్న చాలా మంది హీరోయిన్స్‌ తో పోల్చితే దివి అంతకు మించి అందంగా ఉంటుందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్‌ మీడియాలో దివి అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి చీర కట్టు ఫోటోలతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆకట్టుకునే అందం తో పాటు అలరించే నడుము అందం చూపిస్తూ దివి ఇచ్చిన ఫోటో ఫోజ్‌ లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


సాధారణంగా అందమైన ముద్దుగుమ్మలు రెడ్‌ చీరలో నడుము అందం చూపిస్తూ ఉంటే చూపు తిప్పుకోలేం. అలాంటిది అందాల దివి తన యొక్క నడుము అందం చూపిస్తూ కవ్విస్తున్నట్లుగా ఫోజ్‌ ఇవ్వడంతో ఇంకేమైనా ఉందా... మతి పోయినంత పని అయ్యిందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆ మధ్య చిరంజీవి సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న దివికి ఆశించిన స్థాయిలో టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు రావడం లేదు. వెబ్‌ సిరీస్‌ ల్లో చిన్నా చితకా పాత్రల్లో నటించే ఛాన్స్‌ వస్తున్నాయి.. కానీ దివి మాత్రం మంచి ఆఫర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందు ముందు అయినా దివికి మంచి అవకాశాలు రావాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.