రంగస్థలం నటులు - దర్శకులు కావాలనుకుంటున్నారా?
ఆంధ్ర విశ్వ కళాపరిషత్ రంగస్థలం విభాగం అందించే డిప్లమో కోర్సులో చేరడానికి అవకాశం కల్పిస్తోంది
By: Tupaki Desk | 18 Aug 2023 4:33 AM GMTరంగస్థల నటులు - దర్శకులు కావాలని ఉందా? అయితే ఆంధ్ర విశ్వ కళాపరిషత్ రంగస్థలం విభాగం అందించే డిప్లమో కోర్సులో చేరడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి గాను విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 25. రంగస్థలంలో డిప్లమో కోర్స్ చేయడం ద్వారా నటులుగా దర్శకులుగా రాణించే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మక ఏయూ రంగస్థల విభాగం ఎంతో మంది పేరెన్నికగన్న కళాకారులను అందించింది. ఐదున్నర దశాబ్దాలుగా కళామ తల్లి సేవలో ఈ భాగం పునీతమవుతుంది.
డిప్లమో ఇన్ యాక్టింగ్, డిప్లమో ఇన్ డైరెక్షన్ కోర్సుల్లో రెండేళ్ల కాలపరిమితికి ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వారు ఏడాదికి రూ.7500/- ఫీజు చెల్లించి ఈ కోర్సులను అభ్యసించవచ్చు. అయితే ఇవి పూర్తి అకడమిక్ సమయం అవసరం లేద. సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు క్లాసులు జరుగుతాయని ఏయు రంగస్థల విభాగం ప్రకటించింది. మరిన్ని వివరాలకు ఏయు ఆఫీస్ మేనేజర్ శ్రీనివాసరావు 88979 74033, ఆఫీస్ అసిస్టెంట్ నేతాజీ 7989957255 సంప్రదించవచ్చు అని ప్రకటించారు. దరఖాస్తులు చేరవలసిన చివరి తేదీ 2023 ఆగస్టు 25. పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు అందుబాటులో ఉంటాయి.
సినీపరిశ్రమలో ప్రాధాన్యత:
నిజానికి సినీపరిశ్రమకు ఔత్సాహిక నటీనటులు క్రియేటర్లు ఎందరు వచ్చినా కానీ రంగస్థలం నుంచి వచ్చిన వారికి గొప్ప ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవల టాలీవుడ్ లో రాణించిన మేటి కళాకారుల్లో రంగస్థల నటీనటులకు సముచిత గౌరవం దక్కడమేగాక విరివిగా అవకాశాలు కల్పిస్తున్నారు. రంగస్థల దర్శకులుగా రాణించిన పలువురు సినీరంగంలో దర్శకులుగాను పని చేస్తున్నారు. పరుచూసి సోదరులు - కీ.శే. గొల్లపూడి మారుతీరావు- తనికెళ్ల భరణి సహా ఎందరో రంగస్థల ప్రతిభావంతులు సినీరంగంలో దశాబ్ధాల పాటు ఏలారు. వారి శిష్యులు ఈ రంగంలో రాణించారు.