Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : బీచ్ లో అందాల 'తడాఖా' బ్యూటీ

గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో చాలా సన్నగా నాజూకుగా తయారు అయినట్టుగా అనిపిస్తోందని ఈ ఫోటోలు చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 1:30 PM GMT
పిక్ టాక్‌ : బీచ్ లో అందాల తడాఖా బ్యూటీ
X

మల్టీ టాలెంటెడ్ బ్యూటీ అనిపించుకున్న ముద్దుగుమ్మ ఆండ్రియా జర్మియా 2005 సంవత్సరం లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తమిళ్ తో పాటు తెలుగు మరియు మలయాళం సినిమాల్లో కూడా నటించడం ద్వారా సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పాపులారిటీని సొంతం చేసుకుంది.


ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించిన ఈ అమ్మడు చూడ్డానికి ఇంగ్లీష్ బ్యూటీ ఉన్నట్లుగా ఉంటుంది. అందుకే ఈమెకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. ఆండ్రియా తన పదేళ్ల నుంచి కూడా పాటలు పాడుతూ వస్తుంది. అందుకే ఈ అమ్మడికి ఇండస్ట్రీ లో ఎంట్రీ దక్కింది.

తెలుగు లో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోయిన ఆండ్రియా తమిళ్‌ లో మాత్రం స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంటూ వచ్చింది. ఇక ఈ అమ్మడు రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ వచ్చింది.

తాజాగా మరోసారి బీచ్ లో ఎల్లో బికినీలో తన అందాల ఫోటోలను షేర్ చేసింది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో చాలా సన్నగా నాజూకుగా తయారు అయినట్టుగా అనిపిస్తోందని ఈ ఫోటోలు చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అందంతో ముద్దుగుమ్మ సౌత్‌ లో మరి కొంత కాలం స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ గా నటించవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.