విజయ్ రాజకీయాల గురించి ఆండ్రియో!
తలపతి విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Aug 2024 12:30 AM GMTతలపతి విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీ స్థాపించి 2026 ఎన్నికలకు శమర శంఖం పూరించారు. విజయ్ తెరంగేట్రంతో అభిమానులు ఆనందా నికి అవదుల్లేవ్. అదే సమయంలో సినిమాలు మిస్ అవుతాం? అన్న ఆవేదన అభిమానుల్లో కనిపిస్తుంది. ఇక విజయ్ ఎంట్రీపై రాజకీయ విశ్లేషకులు ఎవరి అభిప్రాయాలు వారు పంచుకుంటున్నారు.
విజయ్ పార్టీ లాంచ్ చేసిన అనంతరం పరిశ్రమ తరుపున అంతా విషెస్ తెలియజేసారు. ఆయనకు రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది? అని ఎవరూ గెస్ చేసి చెప్పింది లేదు గానీ పరిశ్రమ నుంచి అంతా సానుకూలంగా స్పందించారు. విశ్వనటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ఇలా స్టార్ హీరోలంతా విజయ్ రాజకీయాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. అలాగే త్రిష సైతం తన బాగా దగ్గరైన స్నేహితుడు ఆ రంగంలోనూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా నటి, సింగర్ అండ్రియో జర్మేనియా కూడా స్పందించింది. ఆమె హీరోయిన్ గా నటించిన `మాస్క్` చిత్రం రిలీజ్ సందర్భంగా సినిమాప్రమోషన్ లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే? విజయ్ వెళ్లడంపై సంతోషంవ్యక్తం చేసింది. సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ అయ్యారో? అక్కడా సక్సెస్ దిశగా అడుగలేసి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది.
మరి మీరు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అంటే అందుకు అవకాశమే లేదంది. అలాంటి ఆలోచన కూడా తన బుర్రలోకి రాదని తెలిపింది. ఉన్నంత కాలం సినిమాలు, పాటలు పాడుతూ ప్రేక్షకుల్ని అలరించడం తప్ప మరో ఆలోచన లేదని..కళను మించి ఇంకే రంగంలోనూ రాణించలేనని తెలిపింది.