Begin typing your search above and press return to search.

స్టైలిష్ లుక్ లో ఆండ్రియో సంథింగ్ స్పెష‌ల్!

తాజాగా అమ్మ‌డు అందుకు భిన్న‌మైన దుస్తుల్లో ఆక‌ర్షించే కొత్త ప్ర‌య‌త్నం చేసింది. ఇదిగో ఇక్క‌డిలా గ్రీన్ క‌ల‌ర్ కోట్ లో సొగ‌స‌రి ఒదిగిన వైనం ఎంతో ఆక‌ర్షణీయం.

By:  Tupaki Desk   |   17 Aug 2024 7:14 AM GMT
స్టైలిష్ లుక్ లో ఆండ్రియో  సంథింగ్ స్పెష‌ల్!
X

ఆండ్రియో జ‌ర్మేనియా ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హాట్ ఫోటోల‌తో సెగ‌లు పుట్టిస్తుంది. ఈ మల్టీ ట్యాలెంటెడ్ గాళ్ల్ చెన్నై సోయ‌గాలంద‌రికంటా య‌మా స్పీడ్. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఐడెంటీటినే క్రియేట్ చేసుకుంది. త‌నదైన మార్క్ ఎలివేష‌న్స్ తో ఆక‌ర్షించ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. బికినీ అయినా, టూపీసులైనా..పూల్ సైడ్ అయినా సెగ‌లు పుట్టించాల్సిందే.

తాజాగా అమ్మ‌డు అందుకు భిన్న‌మైన దుస్తుల్లో ఆక‌ర్షించే కొత్త ప్ర‌య‌త్నం చేసింది. ఇదిగో ఇక్క‌డిలా గ్రీన్ క‌ల‌ర్ కోట్ లో సొగ‌స‌రి ఒదిగిన వైనం ఎంతో ఆక‌ర్షణీయం. శ‌రీరాన్ని డిజైన‌ర్ ఆభ‌ర‌ణాల‌తో మ‌రింత‌ అందంగా అలంక‌రించింది. మెడ‌లో ధ‌రించిన వివిధ ర‌కాల యాక్స‌రీస్ అమ్మ‌డికి కొత్త లుక్ ని తీసుకొ చ్చాయి. చేతికి వేసిన గాజులు సైతం అంతే మోడ్ర‌న్ గా క‌నిపిస్తున్నాయి.

వేలికి ధ‌రించిన ఉంగ‌రం సైతం సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంది. డిజైన్ అంతా చాలా ఓల్డ్ గా క‌నిపిస్తుంది. గిరిజ‌న తెగ ధ‌రించే డిజైన్స్ లా హైలైట్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఆండ్రియోని ఆ డిజైన్స్ లో చూసి ఒక్క క్ష‌ణం పాటు స్ట‌న్ అవ్వ‌డం ఖాయం. ఆమె ఆండ్రియోనా? విదేశీ మోడ‌లా? అన్న సందేహం క‌లుగుతుంది. అమ్మ‌డి ఫేస్ లో సైతం కొన్ని ర‌కాల మార్పులొచ్చాయి. మునుప‌టి కంటే రూప లావ‌ణ్యంలో కొంత మార్పు క‌నిపిస్తుంది.

ఇక కోలీవుడ్ లో ఆండ్రియో జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంత మంది భామ‌లొచ్చినా పోటీతో సంబంధం లేకుండా కొత్త అవ‌కాశాలు ఉండనే ఉంటున్నాయి. ఆ ర‌కంగా అమ్మ‌డు ఓ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది. త‌న కోసమంటూ కొన్ని పాత్ర‌ల్ని ద‌ర్శ‌కులే క్రియేట్ చేసేలా ఐడెంటిటీ వేసేసింది. ఈ మ‌ధ్య మ‌ళ్లీ లైవ్ పెర్పార్మెన్స్ లు కూడా మొదలు పెట్టింది. వాటి ద్వారానూ బాగానే సంపాదిస్తుంది.