ఆండ్రియో రొమాన్స్ కి డైరెక్టర్ సిగ్గుపడ్డాడా?
అయితే ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తోన్న దర్శకుడు మాత్రం చాలా సిగ్గుపడ్డాడని తెలిపింది. తాను ఎలాంటి షై ఫీలింగ్ లేకుండా దర్శకుడు చెప్పింది చేస్తున్నా?
By: Tupaki Desk | 25 Dec 2023 1:48 PM GMTకోలీవుడ్ హాట్ బ్యూటీ ఆండ్రియో జర్మేనియాలో రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సన్నివేశం డిమాండ్ చేసిందంటే? అమ్మడు రొమాన్స్ లోనూ ఏమాత్రం తగ్గదని చాలా సినిమాల్లో నిరూపిం చింది. బెడ్ రూమ్...పెదవి ముద్దులు...స్విమ్ షూట్...ఇలా ఎలాంటి సన్నివేశాలకైనా ఆండ్రియో నో చెప్పడానికి ఛాన్సే లేదనిపిస్తుంది. తనలో ఆ క్వాలిటీనే అమ్మడిని హీరోయిన్ గా మరింత పైకి తీసుకెళ్లింది.
సింగింగ్ నుంచి నటిగా టర్న్ అయి సక్సెస్ అయిందంటే? నటనలో అన్ని రకాల టెక్నిక్ లు పట్టుకోవ డంతోనే సాధ్యమైంది. ఈనేపథ్యంలో అమ్మడు తాజాగా ఓ బోల్డ్ కామెంట్ తో నెట్టింట్లోకి వచ్చేసింది. ధనుష్..ఆండ్రియో జంటగా 'వడచెన్నై' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో దర్శకుడు అమీర్ కి భార్యగా ఆండ్రియో నటించింది. తన భర్తను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె తనని తాను ఎలా మలుచుకుంది? అన్నది తెరపై ఎంతో రొమాంటిక్ గా హైలైట్ చేసారు.
సినిమాలో ఆ సన్నివేశాలు అంతే హైలైట్ అయ్యాయి. అయితే ఐదేళ్ల నాటి సంగతిని మళ్లీ అమ్మడు ఇప్పుడిలా గుర్తు చేసి తానెంత ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అన్నది చాటి చెప్పింది. వడచెన్నై చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తోన్న సమయంలో తానెంత మాత్రం సిగ్గుడలేదుట.ఎంతో ధైర్యంగా ఆ సన్నివేశాల్ని ఓన్ చేసుకుని నటించాను అని చెప్పింది. కెమెరా ముందు అలా బోల్డ్ గా నటించడానికి తానెంత మాత్రం సిగ్గు పడలేదని తె లిపింది.
అయితే ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తోన్న దర్శకుడు మాత్రం చాలా సిగ్గుపడ్డాడని తెలిపింది. తాను ఎలాంటి షై ఫీలింగ్ లేకుండా దర్శకుడు చెప్పింది చేస్తున్నా? తనని చూసి అలా చూసి దర్శకుడు మాత్రం బాగా ఇబ్బంది పడ్డాడని అంది.