Begin typing your search above and press return to search.

ఆ క్రికెట‌ర్‌తో ప్రేమ‌లో ప‌డొద్దంటున్న అవిక ఫ్యాన్స్

`ఉయ్యాల జంపాల` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అవికా గోర్ ఆ త‌ర్వాత అర‌డ‌జ‌ను పైగానే సినిమాల్లో న‌టించింది.

By:  Tupaki Desk   |   3 May 2024 4:21 AM GMT
ఆ క్రికెట‌ర్‌తో ప్రేమ‌లో ప‌డొద్దంటున్న అవిక ఫ్యాన్స్
X

`ఉయ్యాల జంపాల` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అవికా గోర్ ఆ త‌ర్వాత అర‌డ‌జ‌ను పైగానే సినిమాల్లో న‌టించింది. కానీ తెలుగులో ఆశించినంత బిగ్ బ్రేక్ రాలేదు. ఆ త‌ర్వాత హిందీ చిత్ర‌సీమ‌ స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో న‌టించింది. ఇప్పుడు మ్యూజిక్ ఆల్బ‌మ్స్ తోను ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచాల‌ని ఉవ్విళ్లూరుతోంది. ఆస‌క్తిక‌రంగా క‌రేబియ‌న్ క్రికెట‌ర్ ఆండ్రీ ర‌స్సెల్‌తో క‌లిసి ఒక మ్యూజిక్ ఆల్బ‌మ్‌లో అవిక క‌నిపించ‌నుంది.


కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ టి 20 మ్యాచ్ ల‌లో గేమ్ ఛేంజ‌ర్ గా అల‌రిస్తున్నాడు. అత‌డు ఇప్పుడు మ్యూజిక్ వీడియోలో అరంగేట్రం చేయబోతున్నాడు. రస్సెల్ కొత్త మ్యూజిక్ వీడియోకి సంబంధించిన ఫోటోషూట్ కూడా రివీలైంది. వెస్టిండీస్ క్రికెటర్ అయిన ర‌సెల్ తన సహనటి అవికా గోర్ స‌ర‌స‌న‌ పోజులిచ్చిన పోస్టర్ విడుద‌లైంది. ఈ పోస్ట‌ర్ అభిమానుల్లో క్ష‌ణాల్లోనే వైర‌ల్ గా మారింది. ఈ మ్యూజిక్ వీడియో మే 9న విడుదల కానుంది. ఆండ్రీ రస్సెల్ మొదటి బాలీవుడ్ మ్యూజిక్ సాంగ్ `లడ్కీ తూ కమాల్ కీ` మే 9న విడుదల అవుతుంది అని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

T20 ప్రపంచ కప్ రియ‌ల్ హీరో:

బాలీవుడ్ సంగీతంపై ఆండ్రీ రస్సెల్‌కు ఉన్న ల‌వ్ అంతా ఇంత‌కాదు. ఇది నిజానికి రహస్యం కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొనసాగుతున్న సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పర్యటనలో అతడు మ్యూజిక్ ప్రియుడిగా బ‌య‌ట‌ప‌డ్డాడు. విశాఖపట్నం పర్యటనలో ఫ్రాంచైజీ బాలీవుడ్ చిత్రం డుంకీ నుండి `లుట్ పుట్ గయా` పాటను రూపొందించ‌గా.. వెస్టిండీస్ స్టార్ ర‌సెల్ .. రింకు సింగ్‌తో కలిసిన వీడియోను ప్రదర్శించాడు. కోల్‌కతాకు చెందిన ఫ్రాంచైజీ సహ-యజమాని షారూఖ్ ఖాన్ ఇందులో క‌థానాయ‌కుడు. రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌లుగా నిలిచిన టీమ్ స‌భ్యుడు. గేమ్ ఛేంజ‌ర్ గా ర‌సెల్ కి మంచి ఇమేజ్ ఉంది. అందుకే అవిక‌తో క‌లిసి న‌టిస్తున్నాడు గ‌నుక ఫ్యాన్స్ ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. క్రికెట‌ర్ తో ప్రేమ‌లో ప‌డొద్దంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి ఐపీఎల్‌లో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో ఆండ్రీ రస్సెల్ ఒకరు. అతడు 2012లో అరంగేట్రం చేసిన తర్వాత పోటీలో తన ఆట‌తో ప్ర‌తిభ‌తో విలువను పెంచుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మారాడు. అప్పటి నుండి రస్సెల్ KKR కోసం అనేక మ్యాచ్-విన్నింగ్ ఆట‌తో మెప్పించాడు. కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)పై తన తొలి సీజన్‌లో ట్రోఫీని గెలుచుకున్నాడు. 2019లో టోర్నమెంట్‌లో 11 వికెట్లు పడగొట్టి, బ్యాట‌ర్ గా 510 పరుగులు జోడించిన రస్సెల్ తన అత్యుత్తమ ఆట తీరును ప్ర‌ద‌ర్శించాడు.

గత దశాబ్ద కాలంలో రస్సెల్ ఫ్రాంచైజీ లీగ్‌లో బ‌లమైన‌ ఆల్ రౌండర్‌గా స్థిరపడ్డాడు. మొత్తంమీద అతడు టోర్నమెంట్‌లో 121 మ్యాచ్‌లు ఆడి 2441 పరుగులు చేసి 105 వికెట్లు సాధించాడు.

ఆండ్రీ రస్సెల్ తన మ్యూజిక్ వీడియో లాంచ్ కోసం సిద్ధమవుతుండగా అభిమానుల్లో కోలాహాలం క‌నిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్ప‌టికే ప్లేఆఫ్‌లలోకి ప్రవేశించడంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఏప్రిల్ 29న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన విజయంతో వారు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు ఈ శుక్రవారం మే 3న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో పోటీపడుతుంది.