రాజ్ తరుణ్, లావణ్య కేసులో కొత్త కోణం తెరపైకి ప్రీతి
రాజ్ తరుణ్ కి చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్నాయని కూడా కొన్ని ఫోటోలని లావణ్య బయటపెట్టింది.
By: Tupaki Desk | 3 Aug 2024 7:44 AM GMTరాజ్ తరుణ్, లావణ్య వివాదం ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ మీద సంచలన ఆరోపణలు చేస్తూ లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనని వాడుకొని వదిలేశాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అలాగే మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ కి చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్నాయని కూడా కొన్ని ఫోటోలని లావణ్య బయటపెట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజ్ తరుణ్ కి నోటీసులు కూడా ఇచ్చారు. రాజ్ తరుణ్ ఈ కేసు వ్యవహారంలో హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరుతున్నారు. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో ఆర్జే శేఖర్ భాషా రెగ్యులర్ గా మీడియా ముందుకొచ్చి లావణ్యకి వ్యతిరేకంగా తన వాయిస్ వినిపిస్తున్నారు. లావణ్య డ్రగ్ అడిక్ట్ అని, ఆమె చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. డ్రగ్స్ దందా చేస్తుందని సంచలన విమర్శలు చేశారు. రీసెంట్ గా ఓ ఛానల్ స్టూడియోలో ఆర్జే శేఖర్ భాషాని లావణ్య చెప్పుతో కొట్టింది.
ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే శేఖర్ భాషా ఇప్పుడు లావణ్యకి వ్యతిరేకంగా తన వాయిస్ ని మరింత గట్టిగా వినిపిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో ప్రీతి అనే అమ్మాయి తెరపైకి వచ్చింది. లావణ్య తనకి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందని. మీడియా ఛానల్స్ లోకి వచ్చి సంచలన ఆరోపణలు చేసింది. లావణ్య తనకి ఫోన్ చేసి బెదిరిస్తుందని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రీతి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినపుడు ప్రీతితో పాటుగా శేఖర్ భాషా కూడా ఉన్నారు.
ఇక ప్రీతి ఇచ్చిన ఫిర్యాదు పరిశీలిస్తున్నామని, అందులో ఆధారాలు కూడా చూస్తున్నామని పోలీసులు తెలిపారు. అలాగే ఆమె కంప్లైంట్ మా పరిధిలోకి వస్తుందా లేదా పరిశీలిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. విచారణ జరిపి తరువాత ఫిర్యాదుపై కేసు నమోదు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. లావణ్య బాధితులు చాలా మంది ఉన్నారని, వారందరిని బయటకి తీసుకొచ్చి ఆమెని జైలుకి పంపిస్తానని శేఖర్ భాషా ఛాలెంజ్ చేస్తున్నారు.
మరో వైపు లావణ్య కూడా శేఖర్ భాషాని రాజ్ తరుణ్ వెనకుండి నడిపిస్తున్నాడని నమ్ముతుంది. శేఖర్ భాషా మీద కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే దీనిపై న్యాయపోరాటం చేస్తానని, రాజ్ తరుణ్ ని జైలుకి పంపిస్తానని అంటోంది. మరి ఈ వ్యవహారం ఎంత వరకు కొనసాగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.