Begin typing your search above and press return to search.

దేవర లీకులకి బ్రేక్స్ పడాల్సిందే

ఎన్టీఆర్ ఏడాది టైం తీసుకొని కొరటాల శివతోనే దేవర చేయడానికి కారణం ఏమై ఉంటుంది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది.

By:  Tupaki Desk   |   14 July 2024 11:47 AM GMT
దేవర లీకులకి బ్రేక్స్ పడాల్సిందే
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర షూటింగ్ చివరి దశలో ఉంది. బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ దేవర చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ నుంచి రాబోతున్న మూవీ కావడంతో తారక్ అభిమానులు క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఏడాది టైం తీసుకొని కొరటాల శివతోనే దేవర చేయడానికి కారణం ఏమై ఉంటుంది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది.

ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి రాబోయే సినిమా ఇదే కావడంతో మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రంగా ఈ సినిమా ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా దేవర సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. టేబుల్ ప్రాఫిట్ తో ఈ సినిమాని నిర్మాతలు రిలీజ్ చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ఐదు భాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

దేవర సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన లుక్స్, గ్లింప్స్, సాంగ్ సినిమాపై హైప్ క్రియేట్ చేసాయి. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం, అందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకి లీకుల సమస్య ఎక్కువ అవుతోంది. దేవర సినిమా షూటింగ్ కి సంబందించిన ఫోటోలు చాలా లీకై బయటకొచ్చాయి. సోషల్ మీడియాలో అవి వైరల్ అయ్యాయి. చాలా సార్లు దేవర మూవీ సెట్ నుంచి ఫోటోలు లీకమయ్యాయి.

అయితే తాజాగా దేవర మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కి సంబందించిన ఒక డైలాగ్ బయటకొచ్చిందంట. ప్రస్తుతం దేవర మూవీ డైలాగ్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా లెవల్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య వస్తోన్న సినిమా నుంచి ఎలాంటి లీకులకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది. వీటిని లైట్ గా తీసుకుంటే మున్ముందు సినిమాకి మరింత ప్రమాదం ఎదురయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీపై చాలా నమ్మకంగా ఉన్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి పాన్ ఇండియా లెవల్ లో తనకంటూ సోలో మార్కెట్ దేవరతో క్రియేట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. కొరటాల శివ కూడా మూవీపైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఈ లీకులు మాత్రం అందరిని టెన్షన్ పెడుతున్నాయని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు.