15 ఏళ్ల పాటు మాట్లాడుకోని తండ్రీకొడుకులు!
బాలీవుడ్ నటుడు అంగద్ సింగ్ బేబి సుపరిచితుడే. `కయా తరణ్` సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.
By: Tupaki Desk | 19 Aug 2024 3:44 AM GMTబాలీవుడ్ నటుడు అంగద్ సింగ్ బేబి సుపరిచితుడే. `కయా తరణ్` సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. 2004 లో నటుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ తర్వాత రంగీలే..ఉంగ్లీ లాంటి చిత్రాల్లో నటించాడు. అయితే `పింక్` తో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అంగద్ సింగ కి మంచి పేరుతో పాటు గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి అవకాశాలు పెరిగాయి. `టైగర్ జిందా హై` లాంటి యాక్షన్ సినిమాతోనే అలరించాడు.
అంగద్ తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమే. నేచురల్ స్టార్ నాని నటించిన `హాయ్ నాన్న`లో నటించాడు. అయితే నటుడిగా ఎదిగే క్రమంలో కుటుంబం నుంచి పెద్ద సవాళ్లే ఎదుర్కున్నట్లు తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో రివీల్ చేసాడు. `టీనేజ్ లో నా జుత్తు కత్తిరించుకున్నందుకు నాన్న 15 ఏళ్ల పాటు మాట్లాడటం మానేసాడు. అలాగని ఏ రోజు కోపగించుకోలేదు. కోపడినా బాధ ఉండేదు కాదు. కానీ లోలోపల బాధపడటం నాకస్సులు నచ్చలేదు. నేనొక సిక్కును కాబట్టి జుట్టు కత్తిరించకూడదు.
పొడవుగా పెంచుకుని ముడి వేసుకోవాలి. తలకి పాగా ధరించాలి. కానీ సినిమాల కోసం అలా చేయలేక పోయాను. ఎప్పటికైనా చేయగలను ..కానీ ఇప్పుడు చేయలేనిన సినిమాలపై ఆసక్తితో నాకు నచ్చినట్లు ఉన్నాను. అయితే `పింక్` రిలీజ్ తర్వాత నాన్న నా దగ్గరకొచ్చి మాట్లాడారు. 15 ఏళ్ల తర్వాత మాట్లాడటం అదే తొలిసారి. గట్టిగా హత్తుకున్నారు. నీ దారి నువ్వు ఎంచుకున్నావ్.
నువ్వు చెయ్యాల్సింది చేస్తున్నావ్. కానీ మంచి అవకాశాల్ని ఎంచుకో అన్నారు. నాకు ఎంతో సంతోషం కలిగింది. నాలాంటి అనుభవాలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. తల్లిదండ్రులతో చిన్న చిన్న సమస్యలు సహాజం. కానీ వాటిని పిల్లల వైపు నుంచి ఎక్కువ కాలం కొనసాగించకూడదు. పెద్ద వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తూనే అనుకున్న వాటి వైపు వెళ్లాలి` అని అన్నాడు.