Begin typing your search above and press return to search.

నేను కూడా మ‌నిషినే..ద‌య‌చేసి అలాంటివొద్దు ప్లీజ్!

అయితే తాజాగా అమ్మ‌డు ఈ అంశాల‌పై స్పందించింది.'చిత్రసీమలో ఇలాంటి విమర్శలు నటీమణులు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   20 May 2024 5:47 AM GMT
నేను  కూడా మ‌నిషినే..ద‌య‌చేసి అలాంటివొద్దు ప్లీజ్!
X

బాల న‌టిగా తెరంగేట్రం చేసిన అనికా సురేంద్ర‌న్ సుప‌రిచిత‌మే. 'విశ్వాసం'..'క్వీన్'..'ది గోస్ట్' లాంటి చిత్రాల ద్వారా బాల న‌టిగా మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ హీరోయిన్ గా కూడా ఇటీవ‌ల ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రి హీరోయిన్ అయితే నెట్టింట కామ్ గా ఉంటారా? త‌మ‌దైన శైలిలో ప్రయోగాలు చేసేయ‌రు. ఈ అమ్మ‌డు కూడా న‌వ నాయిక‌ల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఎప్ప‌టిక‌ప్ప‌డు ఇన్ స్టా వేదిక‌గా హాట్ ట్రీట్ అందిస్తుంటుంది.

డిజైన‌ర్ దుస్తుల్లో..చిట్టిపొట్టి నిక్క‌ర్ల‌లో సెగ‌లు పుట్టించే భంగిమ‌ల‌తో త‌న‌ను తాను ప్రమోట్ చేసుకుంటుంది. చిరందంతో సైతం మెరిసిన సంద‌ర్బాలెన్నో. సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ ని రెట్టింపు చేసుకునే ఇలా అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు అనికా జెట్ స్పీడ్ తో చేస్తోంది. న‌వ‌త‌రం భామ కాబ‌ట్టి ఇంకాస్త అడ్వాన్స్ తానూ ఉంటుంది. అయితే సోష‌ల్ మీడియాలో పాజిటివ్ తో పాటు నెగిటివ్ ఉంటుంద‌న్న‌ది తెలిసిందే. ఫోటోల‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు ప‌డుతుంటాయి.

కొన్ని ప్ర‌శంస‌లు..కొన్ని విమ‌ర్శ‌లు ఇలా డ్రెస్సింగ్ సెన్స్ ని ఉద్దేశించి యూజ‌ర్లు పోస్ట్ చేస్తుంటారు. ఒక్కోసారి ట్రోలింగ్ సైతం త‌ప్ప‌దు. అయితే తాజాగా అమ్మ‌డు ఈ అంశాల‌పై స్పందించింది.'చిత్రసీమలో ఇలాంటి విమర్శలు నటీమణులు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు. ఆకర్షణీయంగా దుస్తులు ధరించడం నా వ్యక్తిగత విషయం. నా స్టైలింగ్‌ నా ఇష్టం. విమర్శించారని... నా ఇష్టాన్ని పక్కన పెట్టలేను.

ఈ విమర్శలు వస్తాయి.. పోతాయి. ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. కామెంట్‌ చేయాలనే ఉద్దేశం ఉన్నవారు చీర కట్టుకున్నా కామెంట్స్‌ చేస్తారు. అయితే నా దుస్తుల విషయంలో కొందరు చేసే కామెంట్లు నన్ను చాలా ప్రభావితం చేస్తాయి. నేను కూడా మనిషినే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ద‌య‌చేసి కామెంట్లు చూసుకుని పెట్టండి. వ్య‌క్తిగ‌త విష‌యాలు వ‌ద్దు' అని అనికా ఎమోషనల్‌ అయింది.