Begin typing your search above and press return to search.

ఆత్మ‌హ‌త్య‌కు ముందు కుమార్తెల‌కు అనీల్ అరోరా ఫోన్ కాల్!

మ‌లైకా అరోరా తండ్రి అనీల్ అరోరా సూసైడ్ చేసుకున్న వార్త ప్రేక్ష‌కాభిమానుల్ని దిగ్బ్రాంతికి గురి చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Sep 2024 5:57 AM GMT
ఆత్మ‌హ‌త్య‌కు ముందు కుమార్తెల‌కు అనీల్ అరోరా ఫోన్ కాల్!
X

మ‌లైకా అరోరా తండ్రి అనీల్ అరోరా సూసైడ్ చేసుకున్న వార్త ప్రేక్ష‌కాభిమానుల్ని దిగ్బ్రాంతికి గురి చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న నివాసం ఉంటోన్న ప్లాట్ పై నుంచి కింద‌కి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆత్మ‌హ‌త్త‌కు గ‌ల కార‌ణాలు ఏమై ఉంటాయ‌ని? పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మ‌హ‌త్య‌కు ముందు అనీల్ అరోరా త‌న ఇద్ద‌రు కుమార్తెల‌కు ఫోన్ చేసిన‌ట్ల వార్త‌లొస్తున్నాయి.

మ‌లైకా..అమృత‌ల‌కు ఫోన్ చేసి నేను అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాను. అల‌సిపోయాను అని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే తండ్రికి ప్ర‌తిగా కుమార్తెలిద్ద‌రు ఎలాంటి ధైర్యాన్ని అందించారు? అన్న‌ది మాత్రం ఇంకా బయ‌ట‌కు రాలేదు. ఫోన్ కాల్ లో తండ్రితో ఎలా మాట్లాడి ఓదార్చారు అన్న‌ది తెలియాల్సింది ఉంది.

అయితే మ‌రాణానంత‌రం మ‌లైకా అరోరా ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. మా తండ్రి మ‌ర‌ణం మ‌మ్మ‌ల్ని ఎంతో బాధిస్తోంది. ఆయ‌న చాలా సున్నిత‌మైన భావాలు క‌లిగిన వ్య‌క్తి. కుటుంబం ప‌ట్ల ఎంతో ప్రేమ చూపించేవారు. తాత‌, భ‌ర్త‌గా, తండ్రిగా ఎంతో అంకిత భావంతో, ప్రేమ‌తో ఉండేవారు. ఆయ‌న ఇక లేర‌ని తెలిసి దిగ్బ్రాంతికి గుర‌య్యాం. ఇది తీర‌ని న‌ష్టం. ఈ క‌ష్ట స‌మ‌యంలో మా గొప్య‌త‌కు భంగం క‌లిగించ వ‌ద్దని మీడియాని కోరారు.

మాకు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని ఆశిస్తున్నాం` అని రాసుకొచ్చారు. ఇప్ప‌టికే అనీల్ మృతికి ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు త‌మ ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేసారు. ఇండ‌స్ట్రీ నుంచి మ‌లైకా అరోరాకి ఉన్న సన్నిహితులు, స్నేహితులు అంతా పరామ‌ర్శిస్తున్నారు. క‌ష్ట స‌మ‌యంలో ధైర్యంగా ఉండాల‌ని ఓదార్చుతున్నారు.