అలాంటి వాళ్లతో జాగ్రత్త అంటూ దర్శకుడు ఆరోపణలు!
ఇంటలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్ , ఫస్ట్ టైమర్ ఫీజులను బాలీవుడ్ లోని కొన్ని స్టూడియోలు జోక్ గా చూస్తుంటాయి.
By: Tupaki Desk | 2 Oct 2024 8:30 PM GMTబాలీవుడ్ చిత్రం 'తుంబాడ్' రీ-రిలీజ్ లోనూ మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమాతో దర్శకుడు అనిల్ బార్వే కి మంచి గుర్తింపు దక్కింది. తాజాగా ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్లను ఉద్దేశించి ఆయన పలు సూచనలు చేసారు. 'తొలి సినిమా తెరకెక్కించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంటలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్ , ఫస్ట్ టైమర్ ఫీజులను బాలీవుడ్ లోని కొన్ని స్టూడియోలు జోక్ గా చూస్తుంటాయి.
తమ ప్రాజెక్ట్ ను ప్రేక్షకులకు అందించాలని పోరాడుతోన్న ఎంతోమంది ఫిలింమేకర్స్, నటీనటులు ఈ సమస్య తీవ్రతను గ్రహించడంలో విఫలమవుతున్నారు. ఇలాంటి నిబంధనలను అర్దం చేసుకోవడానికి న్యాయవాదిని నియమించుకునేందుకు కూడా డబ్బులేక వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల నేను పనిచేసి చాలా మంది నటీనటులు, టెక్నీషియన్లు ఈ విధమైన సమస్యను ఎదుర్కున్నట్లు తెలిసింది.
కాంట్రాక్ట్ వల్ల తీవ్రంగా నష్టాలను కూడా చూస్తున్నారు. కాబట్టి భవిష్యత్ లో ఏదైనా కాంట్రాక్ట్ కు సంతకం చేసే ముందు మీ ఇంటలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్ ని కాపాడుకోండి' అని తెలిపారు. అయితే ఆయన ఉన్నట్లుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. 'తుంబాడ్' నిర్మాతలతోనే అనిల్ బార్వేకి ఇలాంటి ఇబ్బందులు ఎదురై ఉంటాయని పలువురు భావిస్తున్నారు.
తుంబాడ్ 2018 లో రిలీజ్ అయిన సినిమా. ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వద్ద 15 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు రీ-రిలీజ్ లోనూ మంచి కలెక్షన్లు సాధిస్తుంది. మహారాష్ట్రలోని తుంబాడ్ గ్రామంలో దాగి ఉన్న నిధి గురించి సాగే అన్వేషణతో ఈ కథ సాగుతుంది.