Begin typing your search above and press return to search.

చిరు - రావిపూడి.. అనుకున్నట్లే టార్గెట్ ఫిక్స్ అయ్యింది!

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాస్ మసాలాతో మిక్స్ చేసే అనిల్ మ్యాజిక్ మెగాస్టార్‌తో వర్కౌట్ అయితే, మరో సూపర్ హిట్ ఖాయమనే టాక్ ఉంది.

By:  Tupaki Desk   |   17 March 2025 1:58 PM IST
చిరు - రావిపూడి.. అనుకున్నట్లే టార్గెట్ ఫిక్స్ అయ్యింది!
X

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌ లో రానున్న సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర పూర్తవ్వడంతో, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. అనిల్ రావిపూడి, తన సినిమాల్లో వినోదాన్ని అద్భుతంగా మిక్స్ చేసే దర్శకుడిగా గుర్తింపు అందుకున్నాడు. అందుకే ఈ కాంబినేషన్ అభిమానుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాస్ మసాలాతో మిక్స్ చేసే అనిల్ మ్యాజిక్ మెగాస్టార్‌తో వర్కౌట్ అయితే, మరో సూపర్ హిట్ ఖాయమనే టాక్ ఉంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. సాధారణంగా అనిల్ రావిపూడి తన స్క్రిప్ట్ పూర్తయ్యాక మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేస్తారు. కానీ ఈసారి మరింత స్పీడ్‌గా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నాలుగు పాటలను కంపోజ్ చేశాడని సమాచారం. అంటే షూటింగ్ స్టార్ట్ కాకముందే ఆల్బమ్ రెడీ అవుతుండటం విశేషం. ఈ ప్రీ-ప్రొడక్షన్ ప్లాన్‌ చూసినంత సేపు, షూటింగ్ కూడా అదే స్పీడ్‌లో జరిగేలా ఉంది.

అనిల్ రావిపూడి హిట్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మరోసారి తన మాస్ ఎంటర్‌టైన్మెంట్ టేక్‌ను ప్రూవ్ చేసుకున్నారు. ఆ సినిమా విజయంతో ఇప్పుడు మెగాస్టార్ మూవీపై మరింత దృష్టిపెట్టారు. అనిల్ గత చిత్రాల ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే, ఆయన మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేను అందించడం ఖాయం. ఈ ప్రాజెక్ట్‌ను తక్కువ సమయంలో ఫినిష్ చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

తాజాగా అనిల్ రావిపూడి సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. చిరంజీవితో తెరకెక్కించబోయే స్క్రిప్ట్‌ను స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైజాగ్ ప్రాంతాన్ని తాను ప్రత్యేకమైన సెంటిమెంట్‌గా భావిస్తానని అనిల్ అన్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. గతంలో ఆయన తెరకెక్కించిన సంక్రాంతి సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. అందుకే మళ్లీ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.

అనిల్ రావిపూడి స్పీడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ప్రాజెక్ట్ మొదలైతే ఎక్కువగా డిలే లేకుండా షూటింగ్ పూర్తి చేయగలడు. గతంలో కూడా సరిలేరు నీకెవ్వరు, F3 వంటి సినిమాలను తక్కువ టైంలో కంప్లీట్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు చిరంజీవితో ఈ ప్రాజెక్ట్‌ను కూడా అదే రీతిలో పూర్తి చేయడానికి బలమైన ప్లాన్ వేశారు. అన్నీ కరెక్ట్‌గా జరిగితే, 2026 సంక్రాంతికి మెగాస్టార్ ఈ సినిమాతో బాక్సాఫీస్‌ బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.