ఆయనతో సినిమా అంటే హీరోయిన్లు ఖాళీగా ఉండాలా!
సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల పాత్ర ఎంత వరకూ పరిమితం అంటే? తమ పోర్షన్ షూటింగ్ ముగించేత వరకే.
By: Tupaki Desk | 5 Jan 2025 9:30 AM GMTసాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల పాత్ర ఎంత వరకూ పరిమితం అంటే? తమ పోర్షన్ షూటింగ్ ముగించేత వరకే. ఆ తర్వాత మళ్లీ అవసరం మేర డబ్బింగ్ చెప్పాలి. అదీ భాష తెలిస్తే. లేదంటే? అక్కడ హీరోయిన్ అవసరం ఉండదు. మళ్లీ సినిమా ప్రచారం సమయంలో రిలీజ్ వరకూ టీమ్ తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. రిలీజ్ అనంతరం సక్సెస్ అయితే? విజయోత్స వేడుకల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఏ స్టార్ హీరోయిన్ అయినా ఇదే కండీ షన్లతో పనిచేస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార అయితే కేవలం షూటింగ్ లో పాల్గొనడం వరకే.
ప్రచారానికి గట్రా హాజరు కాదు. ప్రచారం విషయంలో పలు సందర్భాల్లో దర్శక, నిర్మాతలతో వివాదం పెట్టుకున్న హీరోయిన్లు లేకపోలేదు. అయితే అనీల్ రావిపూడితో సినిమా అంటే? హీరోయిన్ల ఖాళీ సమయాన్ని వినియోగించు కోవడం ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలిదయనొచ్చు. అవును పబ్లిసిటీ కోసం అనీల్ హీరోయిన్లతో ఎలాంటి ఫీట్లు చేయిస్తాడో చెప్పాల్సిన పనిలేదు. 'భగవంత్ కేసరి' రిలీజ్ సమయంలో అందులో నటించిన కాజల్ అగర్వాల్ , శ్రీలీలతో ఆఫ్ ది స్క్రీన్ సినిమాని ఎలా ప్రచారం చేయించుకున్నారో తెలిసిందే.
అదే సినిమాలో పాటలకు తెలివిగా డాన్సులు కట్టించి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వదిలాడు. అలాగే బాలయ్య పాత పాటలకు సంబంధించి కొన్ని పాటలు చేసి రిలీజ్ చేసారు. ఇవి సినిమాకి మంచి పబ్లిసిటీని తీసుకొచ్చాయి. ఇక సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో నటిస్తోన్న మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ తో ఏకంగా స్కిట్లే చేయించేస్తున్నాడు. ఈ విషయంలో హీరో వెంకటేష్ ని కూడా వదిలి పెట్టడం లేదు.
ఈ నలుగురి కాంబినేషన్ లో చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. అలాగే మీడియా ప్రెస్ మీట్స్ సమయంలోనూ స్టేజ్ పై స్కిట్లు చేయించేస్తున్నాడు. మరి వీటి కోసం అనీల్ వాళ్లకు ప్రత్యేక పారితోషికం ఇప్పిస్తున్నాడా? లేక సినిమాకి తీసుకున్న పారితోషికం లెక్కలోనే కానిచ్చేస్తున్నాడా? అన్నది తెలియదు గానీ అనీల్ సినిమాలో హీరోయిన్లు మాత్రం అతడికి బాగా సహకరిస్తున్నారు. అందువల్లే అనీల్ కూడా అంతే ఉత్సాహంగా చేయగల్గుతున్నాడు. ఈ తరహా ప్రచారమంతా అనీల్ తన సినిమాలు రిలీజ్ కు ముందే చేయిస్తున్నారు.