రిస్క్ అయినా రస్క్ లో తీసుకుంటాడు!
సాధారణంగా కామెడీ అంటే స్టార్ హీరోలెవరు తొందరగా ముందుకురారు. ఒప్పుకున్నా ఎన్నో రకమైన కండీషన్లతో పనిచేయాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 10 March 2025 3:26 PM ISTస్టార్ హీరోలతో కామెడీ జానర్ చిత్రాలు చేయడం అంటే ఏ డైరెక్టర్ కి అయినా సవాలే. ఆ హీరోలు ఇమేజ్ ను దాటి వచ్చి చేయాల్సిన చిత్రాలవి. అలా చేయాలంటే? కథ అంత బలంగా ఉండాలి. దర్శకుడిని అంతే విశ్వశిస్తే తప్ప సాధ్యం కాదు. సాధారణంగా కామెడీ అంటే స్టార్ హీరోలెవరు తొందరగా ముందుకురారు. ఒప్పుకున్నా ఎన్నో రకమైన కండీషన్లతో పనిచేయాల్సి ఉంటుంది.
కానీ ఈ విషయంలో యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి నూరుశాతం సక్సెస్ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్ స్టార్ మహేష్ తో `సరిలేరు నీకెవ్వరు`లో కామెడీ ఏ రేంజ్ లో పండిచాడో తెలిసిందే. ట్రైన్ ఎపిసోడ్లు సినిమాకి ఆయువు పట్టుగా నిలిచాయి. ఓవైపు సీరియస్ యాక్షన్ కథను చెబుతూనే గొప్ప కామెడీని పండించాడు. అటుపై `భగతవంత్ కేసరి`లో నటసింహ బాలకృష్ణ పాత్రను కూడా అలాగే బ్యాలెన్స్ చేసాడు.
బాలయ్య అంటే యాక్షన్ తప్ప ఇంకే ముండదు. అభిమానుల ఊహకి కూడా మరో ఆలోచన రాదు. అలాంటి బాలయ్య వైవిథ్యమైన పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు. ఇక `సంక్రాంతికి వస్తున్నాం` తో విక్టరీ వెంకటేష్ తో ఏ రేంజ్ కామెడీ చేయించారో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఏకంగా వెంకటేష్ కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా మారిపోయింది. వెంకటేష్ కామెడీతో టైమింగ్ తో పాటు బుల్లి రాజు, భాగ్యం, మీనాక్షి పాత్రలు అంతే గొప్పగా పడటంతో 300 కోట్ల వసూళ్ల చిత్రంగా రికార్డు సృష్టించింది.
త్వరలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది వంద శాతం కామెడీ చిత్రమని చిరంజీవి ముందే చెప్పేసారు. ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి మాస్ అప్పిరియన్స్ ఊహించొద్దని ..కేవలం తనలో కామెడీ మాత్రమే చూడటానికి రండి అని ముందే చెప్పేసారు. కొదండ రామిరెడ్డి లాంటి కామెడీ చిత్రాన్ని అనీల్ తీస్తున్నాడని చిరు అన్నారు. ఇలా స్టార్ హీరోలతో అనీల్ మార్క్ కామెడీ చిత్రాలు చేస్తూ తనకం టూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నాడు. మరికొంత కాలం అనీల్ కామెడీకి తిరుగుండదు.