Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి హిట్ మెషీన్.. ఇది మరో రికార్డ్!

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్స్ అందుకున్న దర్శకుల లిస్ట్ చాలా తక్కువ. ఇక అలాంటి వాటిలో క్రమంగా అత్యంత విజయవంతమైన దర్శకుడిగా ఎదిగారు అనిల్ రావిపూడి.

By:  Tupaki Desk   |   17 Jan 2025 6:28 AM GMT
అనిల్ రావిపూడి హిట్ మెషీన్.. ఇది మరో రికార్డ్!
X

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్స్ అందుకున్న దర్శకుల లిస్ట్ చాలా తక్కువ. ఇక అలాంటి వాటిలో క్రమంగా అత్యంత విజయవంతమైన దర్శకుడిగా ఎదిగారు అనిల్ రావిపూడి. ఈ కమర్షియల్ మేకర్ వరుస బ్లాక్‌బస్టర్లతో తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ఘనవిజయం సాధించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.


అనిల్ పటాస్ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఈ విజయ పరంపరలో తన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాలో వెంకటేశ్ హీరోగా నటించగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది.

అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఇది అనిల్ రావిపూడి కెరీర్‌లో ఐదవ మిలియన్ డాలర్ చిత్రం కావడం విశేషం. గతంలో భగవంత్ కేసరి, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2 సినిమాలు కూడా ఈ ఘనత సాధించాయి. అనిల్ రావిపూడి ప్రతి కథను కూడా కామెడీ యాక్షన్ అలాగే ఫ్యామిలీ డ్రామాలతో హైలెట్ చేస్తూ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాడు.

ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి వెంకటేశ్ తన టైమింగ్ తో ఎట్రాక్ట్ చేశారు. ఈ చిత్రంలో కామెడీ, ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగిన హీరో పరిస్థితిని మంచి కథాంశంతో చూపించారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం 8/8 బ్లాక్‌బస్టర్లను అందుకున్న అరుదైన దర్శకుడిగా నిలిచారు. సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్ళను అందుకున్నాయి.

తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి ఘనత సాధించడం చాలా అరుదు. రాజమౌళి మాత్రమే వరుస విజయాలు అందుకున్న కమర్షియల్ టాలీవుడ్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి నిలిచారు. పెట్టిన పెట్టుబడికి నిర్మాతలకు సరైన లాభం చూపించగలిగే దర్శకుడిగా అనిల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ప్రతీసారి కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు రావడం, కథనాన్ని వినోదంతో నింపడం ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతోంది. అనిల్ దర్శకత్వ శైలి సాధారణ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా తెలుగు సినిమాకు మంచి గుర్తింపు తీసుకొస్తోంది.

ప్రతిసారి కథలకు, పాత్రలకు కొత్తగా ప్రాణం పోయడం ఆయన ప్రత్యేకత. సంక్రాంతికి వస్తున్నాం వంటి విజయాలతో, అనిల్ రవిపూడి తన హిట్ రికార్డును కొనసాగిస్తూ మరిన్ని అద్భుతాలను సృష్టించబోతున్నారు. ఇకపోతే, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ మీద కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ క్లారిటీ రానుంది.