Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్‌కి ప్రామిస్‌ చేసిన అనిల్‌

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలకు ముందే చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది.

By:  Tupaki Desk   |   22 Jan 2025 5:45 AM GMT
మెగా ఫ్యాన్స్‌కి ప్రామిస్‌ చేసిన అనిల్‌
X

2025 సంక్రాంతి విజేతగా నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మరోసారి దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్‌పుల్‌ డైరెక్టర్‌గా నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రతి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని ఇచ్చాడు. తాజాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే రూ.200 కోట్ల వసూళ్లను క్రాస్‌ చేసిన ఈ సినిమా లాంగ్‌ రన్‌లో ఈజీగా రూ.300 కోట్ల వసూళ్లను క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలకు ముందే చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. ఆ విషయాన్ని దర్శకుడు అనిల్‌ రావిపూడి అనధికారికంగా ఒప్పుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్‌ కావడంతో కచ్చితంగా మెగా కాంపౌండ్‌ దర్శకుడు అనిల్‌ని వదిలి పెట్టకుండా వెంటనే చిరంజీవితో సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు అనిల్‌ రావిపూడి సైతం తాను చిరంజీవి గారి సినిమా కోసం రెడీ అవుతున్నట్లు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చిరంజీవితో సినిమా విషయమై మరోసారి దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పందించాడు. కచ్చితంగా ఒక మంచి సినిమాను ఇస్తాను అన్నాడు.

మెగాస్టార్‌ చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్లుగా మంచి మెలోడీ సాంగ్స్‌ను పెట్టనున్నట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని మూడు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందుకే చిరంజీవి వంటి మాస్ హీరోకి మంచి సాంగ్స్ పడితే కచ్చితంగా అంతకు మించి సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో సినిమా గురించి, సినిమాలోని పాటల గురించి అప్పుడే చర్చ మొదలైంది. మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. సమ్మర్‌ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

చిరంజీవి తదుపరి సినిమా అతి త్వరలోనే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవిని సంక్రాంతికి తీసుకు వచ్చేందుకు కచ్చితంగా హార్డ్‌ వర్క్‌ చేస్తాను అని, ఒక మంచి సినిమాను అందరి ముందుకు తీసుకు వచ్చే విధంగా తన హార్డ్‌ వర్క్ ఉంటుంది అంటూ మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు అందరికీ దర్శకుడు అనిల్ రావిపూడి హామీ ఇచ్చాడు. సంక్రాంతికి మరోసారి వచ్చి విజయాన్ని సొంతం చేసుకోవాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నాడు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాను 70 రోజుల్లో చేసిన అనిల్ రావిపూడి కచ్చితంగా చిరంజీవి సినిమాను వంద రోజుల లోపులోనే ముగించే అవకాశాలు ఉన్నాయి. కనుక వచ్చే ఏడాది సంక్రాంతికి చిరు, అనిల్ రావిపూడి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా. మరో వైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్‌ ఉంటుందని అనిల్ రావిపూడి ప్రకటించాడు. అది ఎప్పుడు అనేది చిరు మూవీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.