వచ్చే జన్మలో ఆ హీరోయిన్ గా పుట్టాలనుంది: అనిల్ రావిపూడి
తాజాగా మొన్న సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అనిల్.
By: Tupaki Desk | 10 Feb 2025 10:01 AM GMTపటాస్ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలను చేసుకుంటూ వారితో కామెడీ పండిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి సినిమాలు తీసి సూపర్ హిట్లు అందుకుంటూ వస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటివరకు అపజయమెరగని డైరెక్టర్ గా రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడినే ఉన్నాడు.
తాజాగా మొన్న సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అనిల్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ట్రయాంగిల్ లవ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రతీ ఒక్కరూ లాభపడ్డారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్, మెగాస్టార్ చిరంజీవితో ఓ కామెడీ ఎంటర్టైనర్ ను చేయనున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి అనిల్- చిరంజీవి సినిమాను నిర్మించనున్నాడు. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను అనిల్ మొదలుపెట్టనున్నాడని సమాచారం.
ఇదిలా ఉంటే రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరవగా, అనిల్ రావిపూడి కూడా మరో గెస్టుగా వచ్చాడు. ఈవెంట్ లో యాంకర్ సుమ వచ్చే జన్మలో ఆడపిల్లగా పుట్టే ఛాన్స్ ఉంటే ఏ హీరోయిన్ గా పుట్టాలనుకుంటున్నారని అనిల్ ను అడింది. దానికి అనిల్ చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.
అప్పటి జెనరేషన్ లో అయితే శ్రీదేవి లాగా అని, ఇప్పుడైతే తమన్నా లాగా పుట్టాలని కోరుకుంటున్నట్టు అనిల్ సమాధానం చెప్పడంతో అక్కడ మొత్తం అరుపులు, కేకలు వినిపించాయి. దీన్ని బట్టి చూస్తుంటే అనిల్ కు శ్రీదేవి, తమన్నా అంటే ఇష్టమని అర్థమవుతుంది. ఇక లైలా విషయానికొస్తే విశ్వక్ సేన్ రెండు పాత్రల్లో కనిపించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది.