Begin typing your search above and press return to search.

చిరు సినిమా ప్లాన్ చేంజ్..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను జూన్, జూలైలో రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   21 March 2025 3:00 AM IST
చిరు సినిమా ప్లాన్ చేంజ్..?
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను జూన్, జూలైలో రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ ఈసారి మెగాస్టార్ తో మూవీకి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే వైజాగ్ లో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన అనిల్ రావిపూడి త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాను చాలా తక్కువ పని రోజుల్లో పూర్తి చేసే అనిల్ రావిపూడి చిరు సినిమాను కూడా 90 రోజుల్లో పూర్తి చేసే టార్గెట్ తో దిగుతున్నట్టు తెలుస్తుంది. చిరు సినిమా కోసం పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది.

ఐతే మెగాస్టార్ తో అనిల్ సినిమా అనగానే ఈ సినిమా చిరు మార్క్ కమర్షియల్ యాంగిల్ లో ఉంటుందని అనుకున్నారు. కానీ సినిమా మెగా ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఉంటూనే అనిల్ రావిపూడి మార్క్ ఎక్కువ కనిపించేలా చూస్తున్నారట. అనిల్ మార్క్ కామెడీ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. తన మొదటి సినిమా పటాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కూడా అదే రేంజ్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా కూడా 2026 సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసేలా ఫిక్స్ చేశారట. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ మిగతా విషయాలు తెలియాల్సి ఉంది. అనిల్, చిరంజీవి కాంబో సినిమాకు భీమ్స్ మ్యూజిక్ కన్ఫర్మ్ అయ్యింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు భీమ్స్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది కాబట్టి మెగా మూవీకి కూడా ఆయన్నే ఫిక్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిలో ఉన్న కామెడీ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఐతే అనిల్ ఈ సినిమాను చిరంజీవి గ్యాంగ్ లీడర్ తరహాలో ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ కి ఒక ఫుల్ ఫన్ విత్ యాక్షన్ మసాలా సినిమాగా ఈ కాంబో సినిమా రాబోతుందని చెప్పొచ్చు.