Begin typing your search above and press return to search.

సంక్రాంతి సక్సెస్.. లైన్ లోకి 'మెగా' ప్రాజెక్ట్..!

టాలీవుడ్ లో 100% సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకూ ఆయన తీసిన ఏడు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్ సాధించాయి.

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:05 AM GMT
సంక్రాంతి సక్సెస్.. లైన్ లోకి మెగా ప్రాజెక్ట్..!
X

టాలీవుడ్ లో 100% సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకూ ఆయన తీసిన ఏడు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్ సాధించాయి. లేటెస్టుగా విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కూడా బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజైన ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరబోతోంది. దీంతో అనిల్ నెక్స్ట్ మూవీ గురించి ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ, డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ ను ఇప్పటికే కంఫర్మ్ చేశారు. చిరుతో ఒకటి రెండు మీటింగ్స్ జరిగాయని, ప్రాసెస్ లో ఉందని చెప్పారు. అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో? అనే డౌట్ అందరిలో ఉంది. ఎందుకంటే చిరంజీవితో అధికారికంగా ప్రకటించిన చిత్రాలనే పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిజల్ట్ ను బట్టే అనిల్ తో మూవీ ఉండొచ్చని అనుకున్నారు.

ఊహించినట్లుగానే 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఘన విజయం సాధించింది. వెంకటేశ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. సో చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాకి లైన్ క్లియర్ అయినట్లే అని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీలో నటిస్తున్న చిరు.. రీసెంట్ గా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అయితే దాని కంటే ముందే అనిల్ మూవీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. తక్కువ రోజుల్లో, వీలైనంత త్వరగా సినిమా తీసే దర్శకుడు కావడంతో రావిపూడి వైపే మెగాస్టార్ మొగ్గు చూపుతున్నారని టాక్.

అనిల్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి కోసం ఎక్స్ట్రార్డినరీ స్టోరీ లైన్, బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకున్నామని తెలిపారు. వింటేజ్ చిరుని చూపించను కానీ, తన స్టైల్ లో స్క్రీన్ మీద కొత్తగా ప్రెజెంట్ చేస్తానని చెప్పారు. ఆల్రెడీ మహేశ్ బాబు, వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ లాంటి హీరోలతో వర్క్ చేసిన రావిపూడి.. చిరంజీవితో సినిమా చేయడం తన తదుపరి డ్రీమ్ అని పేర్కొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్టయిన నేపథ్యంలో, బిగ్ బాస్ తో సినిమా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ టాప్ లీగ్ లో చేరే ఛాన్స్ ఉంది.

ఇకపోతే సంక్రాంతి సీజన్ లో వచ్చిన 'గేమ్ ఛేంజర్', 'డాకూ మహారాజ్' సినిమాలపై 'సంక్రాంతికి వస్తున్నాం' పైచేయి సాధిస్తోంది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. అమెరికా నుంచి అమలాపురం వరకూ హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. అన్ని ఏరియాలలో స్క్రీన్స్ పెంచాలని డిమాండ్స్ వస్తున్నాయి. ట్రెండ్ చూస్తుంటే ఇంకొన్ని రోజులు వెంకీ మామ, అనిల్ రావిపూడిల డామినేషన్ ఇలానే కొనసాగేలా కనిపిస్తోంది.